దారుణం.. మహిళ కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ముఖానికి రంగుపూసి, మెడలో చెప్పులదండతో.. వీధుల్లో ఊరేగింపు..

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 1:34 PM IST
Highlights

కస్తూర్బా నగర్‌లో 20 ఏళ్ల యువతిపై అక్రమ మద్యం విక్రయదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నల్లరంగు వేసి, ఆ తరువాత ఆమెను వీధుల్లో ఊరేగించారు. మెడలో చెప్పుల దండ వేసి కొడుతూ దారుణంగా అవమానించారు. హింసించారు. ఈ ఘటనలో నిందితులైన స్త్రీ, పురుషులందర్నీ అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేసింది.

న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె ఇరుగు పొరుగువారే అత్యంత కిరాతకంగా హింసించారు. kidnap చేసి, gang rape చేయించి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు వేసి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఈ ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నలుగురు మహిళలను అరెస్టు చేశారు.

తూర్పు delhiలోని షాహదారా ప్రాంతంలో personal enmity నేపథ్యంలో వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన ఆ మహిళ మీద ఇరుగుపొరుగు వారే దాడి చేశారని పోలీసులు తెలిపారు. "వ్యక్తిగత కక్షల కారణంగా ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన దురదృష్టకర సంఘటన ఈరోజు షహదారా జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను arrest చేశారు. దీనిమీద విచారణ కొనసాగిస్తున్నారు. బాధితురాలికి అన్ని విధాలుగా సహాయం అందిస్తాం.. కావాల్సిన కౌన్సెలింగ్ అందించబడుతున్నాయి" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఘటనపై Delhi Women's Commission‌ సీరియస్ అయ్యింది. నిందితులమీద మరన్ని చర్యలు తీసుకోవాలని, మరిన్ని అరెస్టులు చేయాలని డిమాండ్ చేసింది. బాధిత మహిళను కమిషన్ చైర్‌పర్సన్ Swati Maliwal కలిశారు. 20 యేళ్ల యువతిపై అక్రమ మద్యం విక్రయదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, దారుణంగా హింసించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్విటర్ లో ఆ వీడియో షేర్ చేస్తూ...

"కస్తూర్బా నగర్‌లో 20 ఏళ్ల యువతిపై అక్రమ మద్యం విక్రయదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నల్లరంగు వేసి, ఆ తరువాత ఆమెను వీధుల్లో ఊరేగించారు. మెడలో చెప్పుల దండ వేసి కొడుతూ దారుణంగా అవమానించారు. హింసించారు. ఈ ఘటనలో నిందితులైన స్త్రీ, పురుషులందర్నీ అరెస్ట్ చేయాలని నేను ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ చేస్తున్నాను. అమ్మాయికి, ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలి" అని మలివాల్ ట్వీట్ చేశారు.

మాలివాల్ ఈ ఘటన మీద బాధితురాలు తెలిపిన వివరాలు చెబుతూ.. స్థానికంగా మద్యం, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసే ముగ్గురు వ్యక్తులు ఆమెను ఇంటి నుండి కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారని... వారు ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తుండగా, అక్కడ ఉన్న మహిళలు వారిని అత్యాచారానికి ప్రేరేపించారని తెలిపిందన్నారు.

కొద్ది రోజుల క్రితం వారింటి పక్కింట్లో ఉండే ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ బాలుడి కుటుంబీకులు ఈ దాడికి పాల్పడ్డారు. అతడి మృతికి మహిళే కారణమంటూ అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

బాధితురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం, నిరుడు నవంబర్ 12వ తేదీన అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ప్రేమ పేరుతో  వివాహిత వెంట పడేవాడు. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకోవడంతో వివాహిత, తన బిడ్డతో సహా వేరే అద్దె ఇంటికి మారింది. అయితే, బాలుడి మృతి తరువాత అతని మేనమామ ఆమెను కర్కర్దూమా నుండి తీసుకువెళ్లాడని సోదరి తెలిపింది. 

click me!