మెట్లపై నుంచి పడి యూపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత సుందర్‌లాల్ దీక్షిత్ మృతి

Published : Jan 15, 2023, 10:05 AM IST
మెట్లపై నుంచి పడి యూపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత సుందర్‌లాల్ దీక్షిత్ మృతి

సారాంశం

యూపీలోని హైదర్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నాయకుడు సుందర్‌లాల్ దీక్షిత్ తన 80 ఏళ్ల వయస్సులో మరణించారు. తన ఇంట్లో మెట్లపై నుంచి పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారు 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత మరణించారు. హైదర్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో పలు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన 80 ఏళ్ల సుందర్‌లాల్ దీక్షిత్ తన నివాసంలోని మెట్లపై నుంచి పడటంతో ఆయన తలకు బలమైన గాయాలు అయ్యాయి.

తమిళనాడు కాంచీపురంలో దారుణం: బాయ్‌ఫ్రెండ్ ముందే విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

వెంటనే కుటుంబ సభ్యులు లక్నోలోని లోహియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ ఆయన అప్పటికే మరణించారని డాక్టర్లు ప్రకటించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ఆదివారం నిర్ధారించారు.

సుందర్‌లాల్ దీక్షిత్ హైదర్‌గఢ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన మరణం పట్ల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్‌ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేష్‌ పాఠక్‌ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ