మధ్య ప్రదేశ్ లో అమానుషం... 90 ఏళ్ల వృద్దురాలిపై కామాంధుడి అత్యాచారం

Published : Jan 15, 2023, 07:58 AM ISTUpdated : Jan 15, 2023, 09:19 AM IST
మధ్య ప్రదేశ్ లో అమానుషం... 90 ఏళ్ల వృద్దురాలిపై కామాంధుడి అత్యాచారం

సారాంశం

పండుముసలి అన్న కనీస జాాలి లేకుండా ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. లిప్ట్ పేరుతో వృద్దురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.  

భోపాల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశ వంటి ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు మరెంత కఠినంగా వున్నా మహిళలకు రక్షణ మాత్రం దక్కడం లేదు. యువతులు, మహిళలనే కాదు చిన్నారులు, వృద్దులను కూడా కొందరు మృగాళ్లు వదిలిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు మాయమాటలతోనో, బలవంతంగానో మహిళలపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా మధ్య ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తొంబై ఏళ్ల పండు ముసలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు.  

ఈ అమానుష ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లో జబల్ పూర్ ప్రాంతానికి చెందిన 90 ఏళ్ల వృద్దురాలు శాడోల్ జిల్లాలోని బంధువుల ఇంటికి రైల్లో వెళ్లింది. అయిత శాడోల్ రైల్వేస్టేషన్ కు చేరుకునే సరికి రాత్రి కావడంతో ఆమె అక్కడే పడుకుంది. తర్వాతి రోజు ఉదయం జిల్లా కేంద్రానికి కొద్దిదూరంలోని బంధువుల గ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో ఓ బస్టాండ్ బస్సు కోసం ఒంటరిగా ఎదురుచూస్తున్న వృద్దురాలిపై ఓ కామాంధుడి కన్నుపడింది. 

Read More  మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం.. ఆమె గుణపాఠం ఎలా చెప్పిందంటే? (వీడియో)

పండు ముసలి అన్న కనీస జాలిలేకుండా ఆమెను అనుభవించాలన్న దుర్భుద్ది కలిగింది ఆ దుర్మార్గుడికి. వెంటనే ఆమెవద్దకు వెళ్లి మాయమాటలతో నమ్మించి తన బైక్ పై ఊరివరకు దిగబెతానని ఎక్కించుకున్నారు. అయితే వృద్దురాలిని ఊరికి కాకుండా కొంతదూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు.  

లైంగికదాడితో తీవ్ర అస్వస్థతకు గురయిన వృద్దురాలు స్థానికుల సాయంతో ఎలాగోలా బంధువుల ఇంటికి చేరుకుంది. ఆమెపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుషం వెలుగుచూసింది. బాధిత వృద్దురాలి నుండి వివరాలు సేకరించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu