
న్యూఢిల్లీ: విపక్షాల తరపున ఉప రాష్ట్రపతి పదవికి మాజీ కేంద్ర మంత్రి Margaret Alva,ను బరిలోకి దింపనున్నారు. ఆదివారం నాడు ఎన్సీపీ చీప్ Sharad Pawar ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా జగదీప్ ధన్ కర్ ను బరిలోకి దింపారు. దీంతో విపక్షాల అభ్యర్ధిగా మార్గరెట్ అల్వాను విపక్షాలు బరిలోకి దింపనున్నాయి.గోవా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గతంలో మార్గరెట్ అల్వా గవర్నర్ గా పనిచేశారు.
ఆదివారం నాడు న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో విపక్షాల తరపున ఉపరాష్ట్రపతి పదవికి బరిలోకి దింపే అభ్యర్ది విషయమై చర్చించారు.శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులు, ఆర్ జేడీ, ఎన్సీపీ నేతలు హాజరయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్ధికి పోటీగా విపక్షాలు తమ అభ్యర్ధిని బరిలోకి దింపాయి. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున ద్రౌపది ముర్ము బరిలోకి దింపింది. విపక్షాల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను విపక్షాలు బరిలోకి దింపాయి. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఉప రాస్ట్రపతి ెన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని విపక్సాల కూటమి ప్రకటించింది.