రేపు జైలు నుంచి విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..

Published : Mar 31, 2023, 03:08 PM IST
రేపు జైలు నుంచి విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ..

సారాంశం

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు జైలు నుంచి విడుదల కానున్నారు. 1988లో జరిగిన యాక్సిడెంట్ కేసులో ఆయన ప్రస్తుతం పాటియాలలో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ శుక్రవారం వెల్లడించింది. ‘‘సర్దార్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు పాటియాలా జైలు నుంచి విడుదలవుతారని అందరికీ తెలియజేయడానికి ఇది.’’ అని పోస్టు వెలువడింది.  సిద్ధూ జైలు నుంచి విడుదలయ్యే విషయాన్ని సంబంధిత అధికారులు తెలియజేశారని ఆ ట్వీట్ పేర్కొంది.

ఐదు ద‌శాబ్దాల వేద‌న‌.. ప్ర‌ముఖ అంతర్జాతీయ అథ్లెట్ తయాబున్ నిషా ఉంగ‌రం క‌థ ఇది.. !

అమృత్ సర్ మాజీ ఎమ్మెల్యే అయిన సిద్ధూకు 1988 రోడ్డు ప్రమాదం కేసులో సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పోలీసులకు లొంగిపోయారు. తరువాత ఆయనను పాటియాల జైలుకు తీసుకొచ్చారు. హత్యానేరం కింద ఈ మాజీ కాంగ్రెస్ నేత నిర్దోషిగా విడుదలైనప్పటికీ స్వచ్ఛందంగా గాయపరిచినందుకు దోషిగా తేలడం గమనార్హం. దీంతో అతడికి ఏడాది జైలు శిక్ష, 1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో అతడి అనుచరుడు రూపిందర్ సింగ్ సంధును నిర్దోషిగా ప్రకటించింది.

ఈ యాక్సిడెంట్ కేసులో 1999 సెప్టెంబర్ 22న పాటియాలా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సిద్ధూ, అతని అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును బాధిత కుటుంబాలు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాలు చేశాయి. 2006లో సిద్ధూను దోషిగా తేల్చిన హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 1988 డిసెంబర్ 27న గుర్నామ్ సింగ్ ను సిద్ధూ తలపై కొట్టాడని, దీంతో ఆయన మరణించారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదు - కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

సిద్ధూ జైలులో శిక్ష అనుభవిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆమెకు స్టేజ్ 2 క్యాన్సర్ నిర్ధారణ అవడంతో ఆపరేషన్ కు వెళ్లే ముందు ఆమె ఈ ట్వీట్ చేశారు. తాను 2 ఇన్వాసివ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని ఆమె ట్విట్టర్ పోస్టులో వెల్లడించారు. “నా భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేయని నేరానికి జైలు పాలయ్యాడు. నేరంలో పాల్గొన్న వారందరినీ క్షమించండి. ప్రతిరోజూ నీ కోసం ఎదురుచూడటం నీకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఎప్పటిలాగే మీ బాధను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, దానిని పంచుకోమని అడిగారు. చిన్న ఎదుగుదల చూడడం జరిగింది, అది చెడ్డదని తెలిసింది.’’ అని పేర్కొన్నారు.

విషాదం... మస్కిటో కాయిల్స్ పొగ పీల్చి నిద్రలోనే ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి

నవజ్యోత్ కౌర్ సిద్ధూ తన రెండో ట్వీట్ లో..‘‘నీ కోసం ఎదురుచూశాను, నీకు పదేపదే న్యాయం నిరాకరించబడటం చూశాను. కానీ సత్యం చాలా శక్తివంతమైనది. కానీ అది మిమ్మల్ని మళ్లీ మళ్లీ పరీక్షిస్తుంది. కలియుగ్. క్షమించండి. ఇది స్టేజ్ 2 క్యాన్సర్ కాబట్టి మీ కోసం వేచి ఉండలేను. భగవంతుడు ఇచ్చినది కాబట్టి ఎవరినీ నిందించకూడదు. దేవుడు నీకు సరిగ్గానే ఆలోచిస్తాడు.’’ అని పోస్ట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం