బెయిల్ పిటిషన్ విచారణకు ముందే: ఆసుపత్రిలో హక్కుల నేత స్టాన్ స్వామి మృతి

Published : Jul 05, 2021, 05:20 PM ISTUpdated : Jul 05, 2021, 05:26 PM IST
బెయిల్ పిటిషన్ విచారణకు ముందే: ఆసుపత్రిలో  హక్కుల నేత స్టాన్ స్వామి మృతి

సారాంశం

గిరిజన హక్కుల కార్యకర్త  స్టాన్ స్వామి సోమవారం నాడు జైలులోనే మృతి చెందారు. అతని వయస్సు 84 ఏళ్లు.  భీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో      అరెస్టైన ఆయన 2020 అక్టొబర్ నుండి తలోజా జైలులో ఉన్నాడు.  

ముంబై: గిరిజన హక్కుల కార్యకర్త  స్టాన్ స్వామి సోమవారం నాడు జైలులోనే మృతి చెందారు. అతని వయస్సు 84 ఏళ్లు.  భీమా కోరేగావ్ కేసులో స్టాన్ స్వామిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో      అరెస్టైన ఆయన 2020 అక్టొబర్ నుండి తలోజా జైలులో ఉన్నాడు.పార్కిన్‌సన్స్ బాధితుడుగా ఉన్న ఆయనకు ఇటీవలనే కరోనా సోకడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆదివారం నుండి ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం ఆయన మరణించాడు. స్వామి బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ జరగాల్సి ఉంది. ఈ విచారణకు ముందే ఆయన మరణించారు.ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే సమయంలో స్వామి తరపు న్యాయవాది మిహిర్ దేశాయ్ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

ఫాదర్ స్టాన్ స్వామి బెయిల్ పిటిషన్ విచారిస్తూ మే 21 నాడు ఆయనకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించమని కోర్టు ఆదేశించింది.  వాళ్లిచ్చే వైద్యం ఎంత నిష్ప్రయోజనమో చెబుతూ ఆ ట్రీట్మెంట్ బదులు జైల్లోనే  చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.స్టాన్ స్వామి ఝార్ఖండ్ కు చెందిన ఒక ఆదివాసీ హక్కుల కార్యకర్త. అక్కడి పౌరసమాజమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను ఎంతో గౌరవిస్తుంది.

స్వయంగా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన విడుదలకు డిమాండ్ చేశాడు.  ఝార్ఖండ్ జనాధికార్ మహాసభ స్టాన్ స్వామి ప్రస్తుత స్థితి పట్ల స్పందిస్తూ "స్టాన్ స్వామి కాదు, భారత ప్రజాస్వామ్యం వెంటిలేటర్ మీదుంది అని ప్రకటించింది. 
2018 జనవరి 1న  పుణె సమీపంలోని భీమా కోరేగావ్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఎల్గార్ పరిషత్ సభ్యులు రెచ్చగొట్టే ప్రసంగం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని ఎన్ఐఏ ఆరోపించింది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్