మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

Published : Aug 31, 2020, 11:43 AM IST
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

సారాంశం

ప్రణబ్ ఊపిరితిత్హుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ నిన్నటి నుండి సెప్టిక్ షాక్ స్థితిలో కొనసాగుతున్నారని, వెంటిలేటర్ పైన్నే చికిత్స అందిస్తున్నామని, డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు ఆయనను పర్యవేక్షిస్తుందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. నిన్న రాత్రి నుండి ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రతరమైంది. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

ప్రణబ్ ఊపిరితిత్హుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ నిన్నటి నుండి సెప్టిక్ షాక్ స్థితిలో కొనసాగుతున్నారని, వెంటిలేటర్ పైన్నే చికిత్స అందిస్తున్నామని, డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు ఆయనను పర్యవేక్షిస్తుందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

ప్రణబ్ ఆరోగ్య పరిస్ధితిపై శనివారంవిడుదల చేసిన బులెటిన్ లో ప్రణబ్ దా ఊపరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స కొనసాగిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ ఇంకా డీప్ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆరోగ్య సూచీల్లో మెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రణబ్ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్ రేటు స్థిరంగా, సాధారణంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. 

మాజీ ఉప రాష్ట్రపతి మూత్రపిండ సంబంధిత వ్యవస్థ పని తీరు కూడా కాస్త మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు. కానీ నేటికీ ఆ పరిస్థితి పూర్తిగా క్షీణించినట్టు తెలియవస్తుంది. 

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10వ తేదీన ప్రణబ్ ముఖర్జీకి డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోందని డాక్టర్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu