ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ దుర్మరణం..!

Published : Nov 02, 2021, 11:05 AM ISTUpdated : Nov 02, 2021, 11:12 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ దుర్మరణం..!

సారాంశం

తీవ్రంగా గాయపడిన అన్సి కబీర్, డాక్టర్ అంజన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కేరళలోని కొచ్చిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో.. 2019 మాజీ మిస్ కేరళ అన్ని కబీర్ (25), రన్నరప్ డాక్టర్ అంజన షాజన్(26) లు దుర్మరణం చెందారు. కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ కారులో ఉండగా.. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మాత్రం తీవ్రం గాయపడినట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: అమానుషం.. రెండేళ్ల చిన్నారిని రేప్ చేసి, నీళ్ల ట్యాంకులో పడేసి.. ఓ కామాంధుడి అరాచకం...

ఈ తెల్లవారుజామున కొచ్చిలో జరిగిందీ ఘటన. హైవేపై వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డుపక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.   స్కూటర్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన అన్సి కబీర్, డాక్టర్ అంజన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులోని వారు సీటు బెల్టు ధరించినదీ, లేనిదీ దర్యాప్తు, ఫోరెన్సిక్ సైంటిస్టులు తేలుస్తారన్నారు. అలాగే, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 

Also Read: బెంగాల్‌ ఏమైనా ప్రత్యేకమా?.. బాణాసంచాపై పూర్తి నిషేధం వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు
తిరువనంతపురం జిల్లాకు చెందిన అన్సి 2019లో మిస్ కేరళ పోటీల్లో విజేతగా నిలవగా, ఈ ఏడాది మిస్ సౌత్ ఇండియా ఎంపికైంది. త్రిసూర్‌కు చెందిన డాక్టర్ అంజన షాజన్ కూడా మోడలింగ్‌ను కెరియర్‌గా ఎంచుకున్నారు. అన్సి, అంజన ఇద్దరూ మంచి స్నేహితులని వారి బంధువులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport