మేఘాలయ మాజీ ఆర్థిక మంత్రి ఏహెచ్ స్కాట్ లింగ్డో కన్నుమూత..

Published : Mar 08, 2023, 04:40 PM IST
 మేఘాలయ మాజీ ఆర్థిక మంత్రి ఏహెచ్ స్కాట్ లింగ్డో కన్నుమూత..

సారాంశం

మేఘాలయ ఆర్థిక మంత్రి ఏహెచ్ స్కాట్ లింగ్డో కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్యం వల్ల కలిగే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన 93వ యేట మరణించారు. అప్పటి ఐఎఫ్ఎఎస్ అధికారిగా సేవలు అందించిన స్కాట్.. పదవి విరమణ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

మేఘాలయ మాజీ ఆర్థిక మంత్రి ఆబ్రే హెర్బర్ట్ స్కాట్ లింగ్డో వృద్ధాప్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. బాహ్ స్కాట్ గా అని ముద్దుగా పిలుచుకునే లింగ్డో.. జైవ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయసు 93 సంవత్సరాలు.

ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలను మానుకోండి.. ఐరాస‌లో పాక్ జ‌మ్మూ అంశాన్ని లేవ‌నెత్త‌డంపై భార‌త్ ఆగ్ర‌హం

‘‘బాహ్ స్కాట్ నిన్న రాత్రి వృద్ధాప్యంతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు రేపు వీకింగ్ లోని జైవ్ ప్రెస్బిటేరియన్ శ్మశానవాటికలో జరుగుతాయి’’అని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 1950-1960 లలో స్కాట్ ఐఎఫ్ఎఎస్ (ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిగా పని చేశారు. ఈ సమయంలో ఆయన అరుణాచల్, నాగాలాండ్, మిజోరం పాటు ఈశాన్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో విశిష్ట సేవలందించారని ‘షిల్లాంగ్ టైమ్స్’ నివేదించింది.

మేఘాలయ తొలినాళ్లలో షిల్లాంగ్ మునిసిపల్ బోర్డును సీఈఓగా నియమితులయ్యారు. ఆ హోదాలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించి చెరగని ముద్ర వేశారు. స్కాట్ మిజోరాం చీఫ్ సెక్రటరీగా కూడా పని చేశారు. తరువాత ఆయన ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు ఛైర్మన్‌గా పని చేసిన 1987లో సర్వీస్ నుండి రిటైర్ అయ్యాడు.

తమిళనాడులో బీజేపీకి షాక్.. ఐటీ విభాగానికి చెందిన 13 మంది పార్టీకి రాజీనామా..

పదవీ విరమణ తర్వాత, అతను ప్రజా సేవలో మునిగిపోయాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి 1993, 2003లో షిల్లాంగ్ లోని జైవ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే ఆయన మేఘాలయ ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu