రాసలీల మాజీ మంత్రి రమేష్ కి కరోనా పాజిటివ్

Published : Apr 05, 2021, 12:51 PM IST
రాసలీల మాజీ మంత్రి రమేష్ కి కరోనా పాజిటివ్

సారాంశం

కరోనాను నివారించేందుకు వీలుగా కేంద్రం ప్రజారోగ్య నిపుణులతో కేంద్ర బృందాలను ఏర్పాటు చేసింది. 

కర్ణాటక రాష్ట్రంలో రాసలీలల సీడీ ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. మంత్రిగా ఉన్న రమేష్ జార్కిహోలీ తన పదవి ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కాగా.. తాజాగా ఆయనకు కరోనా సోకింది. దీంతో రమేష్ బెంగళూరు నగరంలో క్వారంటైన్ లోకి వెళ్లారు. 

దేశంలో సోమవారం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో కరోనా కట్టడి కోసం ప్రభుత్వ అధికారులు పలు కఠిన చర్యలు తీసుకున్నారు. కరోనాను నివారించేందుకు వీలుగా కేంద్రం ప్రజారోగ్య నిపుణులతో కేంద్ర బృందాలను ఏర్పాటు చేసింది. మరోవైపు ముంబై నగరంలో బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ కు సోమవారం కరోనా పాజిటివ్ అని తేలింది. 

స్వల్ప లక్షణాలతో పరీక్ష చేయించుకోగా కరోనా అని తేలడంతో తాను హోం క్వారంటైన్ లో ఉన్నానని భూమి పడ్నేకర్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.తనను కలిసిన వారందరూ వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని, ఆవిరి పట్టడంతోపాటు విటమిన్ సి ఆహారం తీసుకోవాలని భూమి పడ్నేకర్ సూచించారు. మాస్కులు ధరిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, సామాజిక దూరం పాటించాలని భూమిపడ్నేకర్ సలహా ఇచ్చారు

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు