ప్రతిపక్షాలు జేడీఎస్‌ను తమలో భాగంగా ఎప్పుడూ పరిగణించలేదు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి..

Published : Jul 17, 2023, 02:12 PM IST
ప్రతిపక్షాలు జేడీఎస్‌ను తమలో భాగంగా ఎప్పుడూ పరిగణించలేదు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి..

సారాంశం

ప్రతిపక్షాలు తమ పార్టీని ఎన్నడూ తమలో భాగంగా భావించలేదని జేడీ(ఎస్)కి చెందిన కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు ప్రాంతీయ పార్టీని తమలో భాగంగా ఎన్నడూ పరిగణించలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) సెకండ్-ఇన్-కమాండ్, హెచ్‌డి కుమారస్వామి సోమవారం అన్నారు. బెంగళూరులో నేడు జరగనున్న విపక్షాల భారీ సభకు ముందు ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.

మహాఘటబంధన్‌లో జేడీ(ఎస్) భాగమవుతుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ, ‘‘ప్రతిపక్షాలు జేడీ(ఎస్‌)ని తమలో భాగంగా ఎప్పుడూ భావించలేదు. కాబట్టి, మహాఘటబంధన్‌లో జేడీ(ఎస్) భాగమయ్యే ప్రశ్నే లేదు అన్నారు.

యూపీఏ పేరు మారిపోతుందా? బెంగళూరు భేటీలో విపక్ష కూటమికి కొత్త పేరు

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి, జెడి (ఎస్) చేతులు కలపవచ్చనే ఊహాగానాలను ఆయన ప్రస్తావించారు.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నుండి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని చెప్పారు. “ఎన్డీయే మా పార్టీని ఏ సమావేశానికి ఆహ్వానించలేదు'' అన్నారు.

కుమారస్వామి ప్రకటనపై కర్ణాటక కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావు స్పందిస్తూ, “జేడీ(ఎస్)కి లౌకిక రాజకీయాలు అంటే తమకు నిజంగా నమ్మకం లేదని మాకు తెలుసు. ఇంతకుముందు కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. కాబట్టి, ఇది కొత్తేమీ కాదు. జనతాదళ్ (సెక్యులర్) అనే ట్యాగ్ పోవాలని నేను భావిస్తున్నాను. అధికారం కోసం ఏమైనా చేస్తారని అంగీకరించాలి. వారికి సిద్ధాంతాలు లేవు, భావజాలం లేదు. వారికి, కుమారస్వామికి అధికారం మాత్రమే ముఖ్యం. కర్ణాటకలో జేడీ(ఎస్)పై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నాను. ఇది కర్ణాటకలో జేడీ(ఎస్)కు అంతం అవుతుంది’’ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందన్న సూచనలను ఆ పార్టీలు నేతలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇరు పార్టీలు కలిసి పోరాడతాయని బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప గతంలో ప్రకటించారు. 

సమయం వచ్చినప్పుడు లోక్‌సభ ఎన్నికలపై పొత్తు విషయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కుమారస్వామి ప్రకటించారు. బిజెపికి చెందిన బసవరాజ్ బొమ్మై కూడా పొత్తుమీద చర్చలు జరుపుతోందని, కుమారస్వామి "కొన్ని అభిప్రాయాలు" వ్యక్తం చేశారని, ఆ దిశగా చర్చలు కొనసాగుతాయని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Tourism : ఏమిటీ.. 2025 లో 135 కోట్ల పర్యాటకులా..! ఆ ప్రాంతమేదో తెలుసా?
Silver Price Hike Explained in Telugu: వెండి ధర భయపెడుతోంది? | Asianet News Telugu