
ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఐఎన్‌ఎల్‌డీ నేత ఓం ప్రకాశ్ చౌతాలాకు ఢిల్లీ కోర్టు శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానాను విధించింది. అతడికి సంబంధించిన నాలుగు ఆస్తులను కూడా జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై అప్పీల్ దాఖలు చేసేందుకు చౌతాలా 10 రోజుల గడువు కోరగా దానిని కోర్టు తిరస్కరించింది.
Assam floods : అస్సాం అతలాకుతలం.. కొనసాగుతున్న వరద ఉధృతి.. మరో ఇద్దరు మృతి..
2005లో సీబీఐ దాఖలు చేసిన ఈ కేసులో న్యాయస్థానం మే 21న ఆయనను దోషిగా నిర్ధారించింది. అయితే శుక్రవారం నాడు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో సెంట్రల్ ఏజెన్సీ 2010 మార్చి 26వ తేదీన ఛార్జిషీటు దాఖలు చేసింది.చౌతాలా 1993-2006 మధ్య కాలంలో చట్టబద్ధమైన ఆదాయానికి మించి రూ.6.09 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు సీబీఐ గుర్తించింది.
టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో పాత్ర పోషించినందుకు 87 ఏళ్ల చౌతాలాను 2013లో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించి పదేళ్ల శిక్ష విధించింది. 3,000 మందికి పైగా జూనియర్ ప్రాథమిక శిక్షణ పొందిన పాఠశాల ఉపాధ్యాయులను మోసపూరితంగా నియమించుకున్న కేసు అది. ఈ కేసులో ఆయన పదేళ్ల జైలు శిక్ష అనుభవించి గతేడాది బయటకు విడుదల అయ్యారు.
Aryan Khan : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. పూర్తి వివరాలు ఇదిగో...
అయితే తాజా డీఏ కేసులో గరిష్టంగా శిక్షించాలని సీబీఐ కోర్టును కోరింది. ఆ వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి అని, కనీస శిక్ష విధించడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఏజెన్సీ కోర్టులో పేర్కొంది. చౌతాలాకు స్వచ్ఛమైన బ్యాగ్ గ్రౌండ్ ఏమీ లేదని, అతడు దోషిగా తేలిన రెండో కేసు ఇదిని తెలిపింది. కాగా INLD నాయకుడిని దోషిగా నిర్ధారించిన ప్రత్యేక న్యాయమూర్తి (PC చట్టం) వికాస్ ధుల్ మాట్లాడుతూ.. చౌతాలా తన ఆదాయ వనరును లేదా ఆ ఆస్తులను ఏ విధంగా సంపాదించాడో నిరూపించుకోలేకపోయారని తెలిపారు. సంతృప్తికరంగా లెక్కించడంలో విఫలమయ్యారని అన్నారు.
Karnataka: మహిళతో రిలేషన్ షిప్.. దళిత యువకుడి దారుణ పరువు హత్య
1999 జూలై 24 నుంచి 2005 మార్చి 5 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చౌతాలా రూ.1,467 కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టారని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ ఆస్తులు అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యులు, ఇతరుల పేర్లలో మీద ఉన్నాయి. చౌతాలా అపారమైన సంపదను పోగుచేసి వేల ఎకరాల భూములు, బహుళ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, ఫామ్‌హౌస్‌లు, రాజభవన గృహాలు, పెట్రోల్ పంపులు, వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు ఏజెన్సీ తెలిపింది. నగదు, నగలు కాకుండా 43 స్థిరాస్తులను కూడబెట్టాడని చెప్పింది.