అమృతానందమయి ఆశ్రమంలో విదేశీ మహిళ ఆత్మహత్య

Published : Jun 26, 2020, 02:35 PM ISTUpdated : Jun 26, 2020, 02:56 PM IST
అమృతానందమయి ఆశ్రమంలో  విదేశీ మహిళ ఆత్మహత్య

సారాంశం

ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే ఆత్మహత్య చేసుకుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.  

కేరళలోని అమృతానందమయి మఠంలో ఓ విదేశీ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. ఆమె వయసు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా.. సదరు విదేశీ మహిళ మృతదేహాన్ని కరునాగపల్లి తాలుక హాస్పిటల్ కి తరలించారు.

కాగా.. సాయంత్రం 8గంటల సమయంలో అమృతానందమయి మఠం భవనంపై నుంచి కిందకి దూకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే ఆత్మహత్య చేసుకుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఆమె యూకేకి  చెందిన మహిళ కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కి వచ్చింది. అయితే.. లాక్ డౌన్ కారణంగా తిరిగి స్వదేశానికి వెళ్లలేకపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇలా చేసి ఉండచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం