Prayagraj Kumbhmela 2025 : మీరు దీన్ని సైకిల్ అనుకున్నారు కదా?... కానీ ఇదో పిండి మర

Published : Jan 16, 2025, 11:57 PM IST
Prayagraj Kumbhmela 2025 : మీరు దీన్ని సైకిల్ అనుకున్నారు కదా?... కానీ ఇదో పిండి మర

సారాంశం

మహాకుంభ్ 2025 లో గాజియాబాద్ కంపెనీ ఒక వింత పిండి మరను ప్రదర్శించింది.  

Prayagraj Kumbh Mela : మహాకుంభ్ 2025 లోని ఓడీఓపీ ప్రదర్శనలో గాజియాబాద్ కు చెందిన ఓ కంపనీ ఓ విచిత్రమైన పిండమరను ప్రదర్శించింది.  సైకిల్ మాదిరిగా పెడల్ తొక్కుతూ పిండమరను నడిపించాలి. దీనివల్ల వ్యాయామానికి వ్యాయామం...పిండికి పిండి వస్తుందని చెబుతున్నారు. ఈ మిషన్ ద్వారా భక్తులు ఉచితంగానే పిండి పట్టుకునే ఏర్పాటుచేసింది సదరు కంపనీ.

ఈ మిషన్ 20 నిమిషాల్లో ఒక కిలో గోధుమలు, మొక్కజొన్న, జొన్న లేదా సజ్జలను పిండిగా మారుస్తుంది. దీన్ని ఇంట్లో చిన్న జిమ్ లాగా వాడుకోవచ్చు. మిషన్ నడపడానికి పెడల్ తొక్కాలి, దాంతో వ్యాయామం అవుతుంది.

ఈ పిండి మిషన్ కంపనీ ప్రతినిధి మాట్లాడుతూ... జిమ్ లేదా యోగా చేయడానికి సమయం లేని వారి కోసం ఈ మిషన్ తయారు చేశామన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు దీన్ని సులభంగా వాడుకొని పిండి పట్టుకోవచ్చని చెప్పారు. పెడల్ తొక్కినప్పుడు మిషన్ లోకి ధాన్యం వెళ్లి పిండిగా మారుతుంది. సైకిల్ లా ఉండే ఈ మిషన్ ఎలక్ట్రిక్ గ్రైండర్ కి ప్రత్యామ్నాయం, పర్యావరణహితం కూడా అని తెలిపారు.

సైకిల్ ను పోలిన పిండిమరపై ఆసక్తి

ఓడీఓపీ ప్రదర్శనలో ఈ మిషన్ అందరి దృష్టిని ఆకర్షించింది. భక్తులు దీన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ మిషన్ వినియోగించడానికి ఈజీగా వుండటం...రోజూ ఉపయోగకరంగా వుండటమే ప్రత్యేకంగా నిలిపాయి. గాజియాబాద్ కంపెనీ ఈ పిండి మర మహాకుంభ్ 2025 లో కొత్తదనానికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది.

 

 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood