మాస్క్ పెట్టుకోమంటే.. ‘ఫూలిష్ రూల్’ అంటూ డాక్టర్ హల్ చల్, అరెస్ట్..

By AN TeluguFirst Published May 20, 2021, 10:11 AM IST
Highlights

మంగళూరుకు చెందిన ఒక డాక్టర్ మాస్క్ ధరించడానికి నిరాకరించాడు. అంతేకాదు అది కరోనా నివారణకు మాస్క్ ధరించాలనడం ‘ఫూలిష్ రూల్’ అంటూ మండిపడ్డాడు. దీంతో ఈ డాక్టర్ మీద కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 

మంగళూరుకు చెందిన ఒక డాక్టర్ మాస్క్ ధరించడానికి నిరాకరించాడు. అంతేకాదు అది కరోనా నివారణకు మాస్క్ ధరించాలనడం ‘ఫూలిష్ రూల్’ అంటూ మండిపడ్డాడు. దీంతో ఈ డాక్టర్ మీద కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. 

మంగళూరులోని ఓ గ్రోసరీ స్టోర్ లో షాపింగ్ చేయడానికి వచ్చిన డాక్టర్.. మాస్క్ వేసుకోలేదు. పెట్టుకోమని అడిగితే దానికి ఒప్పుకోలేదు. దీంతో కర్ణాటక పోలీసులు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో, డాక్టర్ శ్రీనివాస్ ను మాస్క్ పెట్టుకోమని ఓ కస్టమర్ అడగగా, దానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ తరువాత తాను కొన్న వస్తువులకు బిల్లింగ్ కోసం కౌంటర్ దగ్గరికి వెళ్లాడు.. అక్కడ స్టోర్ మేనేజర్ కూడా మాస్క్ పెట్టుకోవాలని శ్రీనివాస్ ను కోరాడు. 

దీనికి సదరు డాక్టర్ ఒప్పుకోకపోగా.. తన బిల్లింగ్ చేయాలంటూ తొందరపెట్టాడు. అంతేకాదు మేనేజర్ తో వాగ్వాదానికి దిగాడు. మాస్క్ పెట్టుకోవాలనడం ఫూలిష్ రూల్ అని మండిపడ్డాడు. 

అంతేకాదు తాను ఇప్పటికే కోవిడ్ బారిన పడి కోలుకున్నానని, కాబట్టి తన వల్ల ఎవరికీ కరోనా రాదని చెప్పడం విశేషం. దీంతో మేనేజర్ పోలీసులకు సమాచారం అందించండంతో అక్కడికి చేరుకున్న పోలీసులు డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

click me!