Fodder Scam Case: లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

Published : Feb 21, 2022, 02:27 PM ISTUpdated : Feb 21, 2022, 02:29 PM IST
Fodder Scam Case: లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..

సారాంశం

దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. 

దాణా స్కామ్ కు సంబంధించి ఐదో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను గత వారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించిన సంగతి తెలిసిందే. Doranda ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. నేడు ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. 

ఇప్పటికే నాలుగు పశు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా కోర్టులు తేల్చాయి.  చైబాసా ట్రెజరీ నుండి విడతల వారీగా రూ.37.7 కోట్లు, రూ.33.13కోట్లు డియోఘర్ ట్రెజరీ నుండి రూ. 89.27 కోట్లు, రూ.3.76 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. తాజాగా  Doranda ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. 

2018లో దుమ్కా కేసులో దోషిగా తేలినందుకు ఆయనపై రూ. 90 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది.గతంలోని నాలుగు కేసులపై  వచ్చిన తీర్పులను కూడా లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేశారు. ఈ తీర్పును కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. ఈ ఐదు కేసులు కూడా పశువుల దాణా కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను స్వాహా చేసిన కేసులే కావడం గమనార్హం.

 2017 డిసెంబర్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉన్నాడు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోనే ఎక్కువకాలం  శిక్షను అనుభవించాడు. గత ఏడాది జనవరి మాసంలలో ఆయన ఆరోగ్యం విషమించడంతో  ఢిల్లీకి తీసుకొచ్చారు.ఈ కేసులో మూడేళ్లకు పైగా శిక్ష పడితే లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

లాలూ ప్రసాద్ యాదవ్ సహా 99 మంది నిందితులపై సీబీఐ ప్రత్యేక కోర్టు  జడ్జి ఎస్ కే శశి గత ఏడాది ఫిబ్రవరి నుండి విచారణ ప్రారంభించారు.  ఈ కేసులో చివరి నిందితుడు డాక్టర్ శైలేంద్ర కుమార్ తరపున వాదనలు ఈ ఏడాది జనవరి 29న పూర్తయ్యాయి. తీర్పు వెలువడే రోజున నిందితులను కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించారు.  ఈ కేసులో 170 మంది నిందితుల్లో 55 మంది నిందితులు ఇప్పటికే మరనించారు. ఏడుగురు ప్రభుత్వ సాక్షులుగా మారారు. ఇద్దరు తమపై వచ్చిన అభియోగాలను అంగీకరించారు. ఆరుగురు ఇంకా పరారీలోనే ఉన్నారు. లాలూతో పాటు మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పీఏసీ ఛైర్మెన్ ధ్రువ్ భగత్, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కేఎం ప్రసాద్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?