కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి నిదర్శనం: ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందంపై కేంద్ర మంత్రి నిర్మలా

By narsimha lodeFirst Published Jan 18, 2022, 7:24 PM IST
Highlights

ఆంట్రిక్స్ - దేవాస్ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ అవినీతికి నిదర్శనమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. 

న్యూఢిల్లీ: 2005 లో Antrix-Devas ఒప్పందంపై supreme Court ఇచ్చిన ఆదేశాలే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి Nirmala Sitharaman విమర్శించారు.

ఈ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత మంగళవారం నాడు కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంట్రిక్స్-దేవాస్ మధ్య ఒప్పందాన్ని రద్దు చేయడానికి Upa ప్రభుత్వానికి ఆరేళ్లు పట్టిందన్నారు. 2005లో యూపీఏ ప్రభుత్వ హయంలో దేవాస్ తో ఆంట్రిక్స్ ఒప్పందం కుదుర్చుకొన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇది ఒక మోసపూరిత ఒప్పందమని ఆమె  విమర్శించారు.

యూపీఏ ప్రభుత్వ తప్పుడు విధానాలకు పాల్పడిందో సుప్రీంకోర్టు ఉత్తర్వులు తెలుపుతున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంట్రిక్స్-దేవాస్ ఒప్పందం దేశ భద్రతకు విఘాతమన్నారు.  ఈ విషయమై ఏం జరిగిందో  కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.

జాతీయ భద్రతా నిబంధనలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ఉపగ్రహలు, స్పెక్ట్రమ్ బ్యాండ్ వంటి వాటిని విక్రయించడం , లేదా ప్రైవేట్ పార్టీలకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించడం కాంగ్రెస్ ప్రభుత్వాల లక్షణమని ఆమె ఎద్దేవా చేశారు. యూపీఏ అత్యాశతో చేసిన పని ఇది అని ఆమె అన్నారు. తాము పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆదా చేయడానికి పోరాడుతున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. 2011లో ఒప్పందం రద్దు చేసిన సమయంలో మధ్యవర్తిత్వం ప్రారంభించిన సమయంలో మధ్యవర్తిని నియమించాలని ఆంట్రిక్స్ కొరినా కూడా అపాయింట్ చేయలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

2005లో ఒప్పందం ప్రకారంగా ఆంట్రిక్స్ రెండు ఉపగ్రహలను తయారు చేసి ప్రయోగించాలి. వీటికి అవసరమైన శాటిలైట్ ట్రాన్స్ పాండర్ల సామర్ధ్యాన్ని 90 శాతాన్ని దేవాస్ కు లీజుకు ఇచ్చింది. ఇది దేశంలో హైబ్రిడ్ శాటిలైట్ , టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి దీనిని ఉపయోగించాలని తలపెట్టారు.  ఈ ఒప్పందంలో రూ. 1000 కోట్ల విలువైన 70 ఎంహెచ్‌జడ్ ఎస్ బ్యాండ్ స్పెక్టమ్ ఉంది. ఈ స్పెక్ట్రమ్ భద్రతా దళాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టెలికం కంపెనీల కోసం పరిమితం చేశారు. భద్రతా కారణాల రీత్యా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. 2016లో దేవాస్ కు రూ. 578 కోట్ల లాభం చేకూరినట్ట ఆరోపణలపై మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ ఇతర అధికారులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

దేవాస్ విదేశీ పెట్టుబడిదారులు అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించారు. 2020లో దేవాస్ కు 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆంట్రిక్స్ ను ఇంటర్నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆర్ఢర్ ను యూఎస్ కోర్టు ధృవీకరించింది. అయితే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. గత ఏడాది కంపెనీల చట్టం ప్రకారంగా దేవాస్ పై వైండింగ్ ఆఫ్ పిటిషన్ ప్రారంభించాలని ప్రభుత్వం ఆంట్రిక్స్ ను కోరింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ దేవాస్ మల్లీమీడియాను మూసివేయాలని ఆదేశించింది.దేవాస్ మల్లీ మీడియా దాఖలు చేసిన అప్పీల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

click me!