పట్టాలపై వరదనీరు: లక్ష్మీపురం సమీపంలో నిలిచిపోయిన హీరాఖండ్ ట్రైన్

Published : Jul 21, 2018, 12:27 PM ISTUpdated : Jul 21, 2018, 03:24 PM IST
పట్టాలపై వరదనీరు: లక్ష్మీపురం సమీపంలో నిలిచిపోయిన హీరాఖండ్ ట్రైన్

సారాంశం

 ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా రైల్వేట్రాక్‌లపైకి కూడ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది.


భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని రాయ్‌గడ్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా రైల్వేట్రాక్‌లపైకి కూడ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది.

ఒడిశాలోని రాయ్‌గఢ్ జిల్లా లక్ష్మీపురం సమీపంలోని బాలుమస్కా‌‌‌స్టేషన్ వద్ద భువనేశ్వర్ నుండి హీరాఖండ్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు  వరద నీటిలో చిక్కుకొంది.వరదలో రైలు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పట్టాలపైనే రైలును నిలిపివేశారు. 

భారీగా పట్టాలపై నుండి వరద నీరు ప్రవాహిస్తున్న కారణంగా  బోగీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో  ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. వరధ ఉధృతి తగ్గిన తర్వాత  రైలును ముందుకు నడిపించాలని అధికారులు భావిస్తున్నారు.

అయితే పట్టాలపై వరద నీరు భారీగా ప్రవహిస్తున్న కారణంగా  బోగీల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది.  ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సింగిపురం టికిరి స్టేషన్ల మధ్య చిక్కుకుపోయినట్టు సమాచారం.  వరదల కారణంగా  రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే