Election Commission: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా! ఈ నెల 8-10వ తేదీల్లో షెడ్యూల్?

By Mahesh K  |  First Published Oct 6, 2023, 1:24 PM IST

ఐదు రాష్ట్రాల  అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ తొలి వారం వరకు ఈ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.
 


న్యూఢిల్లీ: తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఈ నెల  8వ తేదీ నుంచి 10వ తేదీల మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో జరగవచ్చని వివరించాయి. 

2018 లాగే ఈ సారి కూడా తెలంగాణ,రాజస్తాన్, మధ్యప్రదేశ్,మిజోరం రాష్ట్రాల్లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఛత్తీస్‌గడ్‌లోనూ 2018 లాగే రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వివరించాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు తేదీల్లో జరగవచ్చునని చెప్పాయి. అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం డిసెంబర్ 10వ తేదీ నుంచి 15వ తేదీల నడుమ వెలువడచ్చని పేర్కొన్నాయి.

Latest Videos

తెలంగాణ, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగిసిపోతున్నాయి. అదే మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17వ తేదీన ముగిసిపోనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిజోరంలో బీజేపీ మిత్రపక్షం ఎంఎన్ఎఫ్ అధికారంలో ఉన్నాయి.

Also Read: జీ20 సదస్సు: భారత్‌లో అందుకే పర్యటించలేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరణ

ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేస్తున్నాయి. ఈసీ బృందాలు ఈ రాష్ట్రాల్లో పర్యటించాయి. ఎన్నికల కోడ్ సమర్థవంతంగా అమలు చేయడానికి, క్షేత్రస్థాయిలో పారదర్శక పోటీ ఉండేలా డబ్బు, మందబలం ప్రభావం లేకుండా చేసే విధానాలపై ఈసీ శుక్రవారం చర్చిస్తున్నది.

click me!