ఐదుగురు గోవా ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్.. రాష్ట్రపతి ఎన్నికల వేళ నిర్ణయం

Published : Jul 17, 2022, 06:38 AM IST
ఐదుగురు గోవా ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్.. రాష్ట్రపతి ఎన్నికల వేళ నిర్ణయం

సారాంశం

గోవా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు వచ్చినట్టు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా, గోవా కాంగ్రెస్‌లోని మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురిని పార్టీ చెన్నైకి తరలించింది. రేపు మళ్లీ రాష్ట్రపతి ఎన్నికల కోసం వారంతా గోవాకు వచ్చి ఓటు వేయబోతున్నారు.  

న్యూఢిల్లీ: గోవా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు జరుగుతున్నదని, నేతల మధ్య తీవ్ర అగాథం ఏర్పడిందనే వార్తలు వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోనూ చేరే అవకాశం ఉన్నదని కథనాలు వచ్చాయి. కానీ, పార్టీ ఆ వ్యాఖ్యలను కొట్టివేస్తూనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థం అవుతున్నది. తాజాగా రేపు రాష్ట్రపతి ఎన్నికలు జరిగే వేళ కాంగ్రెస్ ఐదుగురు గోవా ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించింది.

గోవాలో  మొత్తం 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఐదుగురు ఎమ్మెల్యేలు కార్లోస్ అల్వరేస్ ఫెరీరా, సంకల్ప్ అమోంకర్, యూరి అమిమావో, రొడాాల్ఫో ఫెర్నాండేజ్, అల్టోన్ డికోస్టాలను కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి చెన్నైకి విమానంలో తీసుకెళ్లింది. నిన్న రాత్రి అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మల్యేలను చెన్నైకి తరలించింది. కాగా, జులై 18వ తేదీన వారు తిరిగి గోవాకు వస్తారని, వచ్చి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయనున్నారు.

ఆరుగురు ఎమ్మెల్యేలు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, దేలియలా, కేదార్ నాయిక్, అలెక్సో సీక్వెరా, రాజేశ్ ఫాల్డెసైలు చెన్నైకి వెళ్లిన గ్యాంగ్‌లో లేరు.

గోవా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా మైఖేల్ లోబోను ఆదివారం తొలగించింది. మైఖేల్ లోబో, దిగంబర్  కామత్‌లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ఈ వేటు వేసింది. బీజేపీతో మిలాఖత్తు అయి పార్టీ లెజిస్లేటివ్ వింగ్‌ను చీల్చాలని ప్రయత్నించినట్టు పేర్కొంది.

మైఖేల్ లోబో, దిగంబర్ కామత్‌లు అందుబాటులో లేకుండా పోయారని కాంగ్రెస్ తెలిపింది. కానీ, అసెంబ్లీ సమావేశాల తొలి రోజుకు హాజరయ్యారు. తాము తప్పుగా నడుచుకోవడం లేదని, తాము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నామని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu