కరోనావైరస్: మహారాష్ట్రలో మరో ఐదు పాజిటివ్ కేసులు, భారత్ లో 102

By telugu team  |  First Published Mar 15, 2020, 9:24 AM IST

కరోనా వైరస్ సోకినవారి సంఖ్య భారత్ లో 102కు చేరుకుంది. మహారాష్ట్రలో మరో రెండు కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు కరోనావల్ల భారతదేశంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే.


న్యూఢిల్లీ: మహారాష్ట్రలో మరో ఐదు కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దాంతో భారత్ లో కరోనావైరస్ సోకినవారి సంఖ్య 102కు చేరుకుంది. అయితే, ఈ సంఖ్యను భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్థారించాల్సి ఉంది. 

శనివారం రాత్రి మహారాష్ట్రలో ఐదు కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దాంతో మహారాష్ట్రలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 31కి చేరుకుంది. కొత్త కేసులో పూణే, ముంబై, నాగపూర్, యవత్మాల్ ల్లో వెలుగు చూశాయి.

Latest Videos

undefined

Also read: కరోనావైరస్: గో మూత్రం విందు, భలే పసందు

రాజస్థాన్ లోని జైపూర్ లో 24ఏళ్ల వయస్సుగల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాజస్థాన్ లో కరోనా పాజిటివ్ కేసులు 4కు చేరుకున్ాయి. స్పెయిన్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు అధికారులు చెప్పారు. 

తెలంగాణలో ఓ కేసు నిర్ధారణ అయింది. ఇటలీ నుంచి వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శాసనసభలో చెప్పారు. మరో ఇద్దరు అనుమానితులు కూడా ఉన్నట్లు తెలిపారు. 

Also Read: కరోనావైరస్: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్లు ఇవీ..

దేశవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. హైదరాబాదుకు వచ్చి కర్ణాటకకు వెళ్లిన ఓ వ్యక్తి కరోనావైరస్ కారణంగా మరణించాడు.

click me!