
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని నమక్కల్ జిల్లాలో మంగళవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. కారు, కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నమక్కల్ జిల్లాలోని పార్మతి వేలూరు వద్ద ఇవాళ ప్రమాదం జరిగింది. కారు, కంటైనర్ ఢీకొనడంతో సంఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందారు. కారు, కంటైనర్ మద్య మృతదేహలు చిక్కుకున్నాయి. దీంతో వాహనాలను పోలీసులు ముక్కలు ముక్కలుగా విడదీయాల్సి వచ్చింది. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. .