భారీ వర్షం...గోడకూలి ఐదుగురు మృతి

Published : Sep 26, 2019, 08:28 AM ISTUpdated : Sep 26, 2019, 08:31 AM IST
భారీ వర్షం...గోడకూలి ఐదుగురు మృతి

సారాంశం

గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.   


గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.... ఈ భారీ వర్షం కారణంగా గోడ కూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మహారాష్ట్ర లోని పూణే లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత పదిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పూణే నగరంలోని సహకారనగర్ ప్రాంతంలో గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అగ్నిమాపకశాఖ, పోలీసులు వచ్చి శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు. 

పూణే నగరంలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. ముంబై నగరంలోని ఖర్ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో పదేళ్ల బాలిక మరణించింది. బాలిక మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. భారీవర్షాల వల్ల పాత భవనాలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు