ప్రసాదం తిని పదిమంది మృతి, 72 మందికి అస్వస్థత

By narsimha lodeFirst Published Dec 14, 2018, 7:56 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్‌ జిల్లా హన్నూర్ తాలుకా పరిధిలో గల సులవధి గ్రామంలో పుడ్ పాయిజన్‌తో పదిమంది మృతి చెందగా, మరో 72 మంది పరిస్థితి విషమంగా ఉంది.


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్‌ జిల్లా హన్నూర్ తాలుకా పరిధిలో గల సులవధి గ్రామంలో పుడ్ పాయిజన్‌తో పదిమంది మృతి చెందగా, మరో 72 మంది పరిస్థితి విషమంగా ఉంది.

సులవధి గ్రామంలోని మారమ్మ దేవాలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ పూజలు నిర్వహించిన తర్వాత భక్తులకు ఇచ్చిన ప్రసాదం తిన్న భక్తులు అస్వస్థతకు గురయ్యారు.

వీరిలో  పదిమంది మృతి చెందగా. మరో 72 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతి చెందిన వారిలో  ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి కూడ ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిని  స్థానిక ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య చికిత్స అందిస్తున్నారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రసాదం శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు

 

click me!
Last Updated Dec 14, 2018, 8:18 PM IST
click me!