కేరళ విమాన ప్రమాదం: పైలట్, కోపైలట్ సహా ఐదుగురు మృతి

By telugu teamFirst Published Aug 7, 2020, 9:48 PM IST
Highlights

కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. పైలట్, కోపైలట్ ఇద్దరు కూడా మృత్యువాత పడినట్లు చెబుతున్నారు.

కోజికోడ్: కేరళలో జరిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. కోజికోడ్ విమానాశ్రయంలో విమానం కూలి రెండు ముక్కలుగా విరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా ఐదుగురు మరణించినట్లు ఇప్పటి వరకు తేలింది. 

విమానం ల్యాండ్ అయిన సమయంలో ఏ విధమైన మంటలు కూడా చెలరేగలేదు. విమానంలో 191 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 174 మంది ప్రయాణికులు వారిలో పది మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నారు. 

Also Read: బ్రేకింగ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన ఫ్లైట్

పైలట్ పేరు దీపక్ వసంత్, కో పైలట్ అఖిలేష్ అని సమాచారం. విమానం సిబ్బంది శిల్ప కటారా, అక్షయ్ పాల్ సింగ్, లలిత్ కుార్, విస్వాస్ గా తెలుస్తోంది. 

ప్రమాదంలో గాయపడిన 50 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. విమానం ల్యాండింగ్ సమయంలో భారీగా వర్షం పడుతోంది. ఆ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారనేది తెలియడం లేదు. మృతుల సంఖ్యపై కూడా కచ్చితమైన సమాచారం లేదు. ప్రమాద స్థలానికి 20 అంబులెన్స్ లు చేరుకున్నాయి.

click me!