బ్రేకింగ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన ఫ్లైట్‌

Siva Kodati |  
Published : Aug 07, 2020, 09:07 PM ISTUpdated : Aug 07, 2020, 09:24 PM IST
బ్రేకింగ్: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన ఫ్లైట్‌

సారాంశం

కేరళలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. కోజికోడ్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం క్రాష్ అయ్యింది. రన్‌వేపై అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం ధ్వంసమవ్వగా పలువురికి గాయాలయ్యాయి. 

ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఇప్పటికే భారీగా అంబులెన్సులు అక్కడికి చేరుకున్నట్లుగా సమాచారం. వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 191 మంది ప్రయాణికులతో ఈ విమానం కేరళకు వస్తోంది.

ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, పదుల సంఖ్యలో గాలయాలైనట్లుగా తెలుస్తోంది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమని డీజీసీఏ ప్రకటించింది. ఇంకా వర్షం కురస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu