51 గంటల్లో ట్రాక్ పునరుద్దరణ.. రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభం.. 

By Rajesh KarampooriFirst Published Jun 5, 2023, 1:33 AM IST
Highlights

బాలాసోర్‌లోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగిన చోట 51 గంటల్లో ట్రాక్ పునరుద్ధరించబడింది. దీంతో ఈ సాయంత్రం మొదటి రైలు దానిపై నడిచింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి రైల్వే మంత్రి క్షేత్రస్థాయిలో ఉంది. పునరుద్దరణ పనులును దగ్గరుండి పర్యవేక్షించారు. 

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం యావత్తు భారతావనిని కుదిపేసింది. వంద‌ల సంఖ్య‌లో మృతులు ఉండ‌డంతో దేశ ప్ర‌జానీకం అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే.. ప్రమాదం జరిగిన తర్వాత కేవలం 51 గంటల్లోనే ఆ ట్రాక్ మరమ్మత్తు చేయబడింది. ఘోర ప్రమాదం జరిగిన బహనాగా రైల్వే స్టేషన్‌లోని రైలు ట్రాక్‌పై ఆదివారం రాత్రి రైలు రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా రెండు రోజులుగా ఘటనా స్థలంలో ఉండి పనులను పర్యవేక్షించారు. బాలాసోర్ రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు

ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బహనాగా రైల్వే స్టేషన్ డౌన్‌లైన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దానిపై మొదటి రైలు ప్రారంభమైందని తెలిపారు. రెండవ లైన్‌కు ఫిట్‌నెస్ కూడా ఇచ్చారని,రెండు ట్రాక్‌లను పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైలు రాకపోకలు సాధారణీకరించబడ్డాయని తెలిపారు. మరో ట్రాక్ పై కూడా రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: రైల్వే మంత్రి

అంతముందుకు .. ఈ ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా విచారణ జరిపించాలని రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. దేశంలోనే అత్యంత దారుణమైన ప్రమాదాల్లో ఒకటిగా అభివర్ణిస్తున్న ఈ ప్రమాదంలో శుక్రవారం 275 మందికి పైగా మరణించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఏం జరిగినా.. అధికార యంత్రాంగం వద్ద ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసిందని తెలిపారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించబడతారని రైల్వే మంత్రి అన్నారు.

రాంగ్ సిగ్నల్ కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని, దాని ఇంజన్, కోచ్..  లూప్ లైన్‌లో ఆగి ఉన్న ఇనుప ఖనిజంతో నిండిన గూడ్స్ రైలును ఢీకొన్నాయని రైల్వే తెలిపింది. అయితే.. విమర్శకులు రైల్వే ఆడిట్ నివేదికను ఫ్లాగ్ చేశారు. ఇది రైలు భద్రతలో అనేక తీవ్రమైన లోపాలను ఉదహరించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఒడిశా ప్రభుత్వం ట్రిపుల్ రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను సవరించింది. మరణించిన వారి సంఖ్య  288 నుండి 275 కి,  గాయపడిన వారి సంఖ్య 1,175 కు తగ్గించబడింది. దేశంలో ఇది మూడో అతి దారుణమైన రైలు ప్రమాదం అని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రమాదం జరిగినప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ లో రైల్వే మంత్రి 
   
బాలాసోర్‌లో ఇంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అప్పటి నుండి అక్కడే నిలబడి ఉన్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్ నుండి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ వరకు రైల్వే మంత్రి నిరంతరం సంఘటన స్థలంలో ఉండి, మొత్తం ఆపరేషన్‌ను గ్రౌండ్ లెవల్ నుంచి   పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన ఈ ట్రాక్‌పై తొలి రైలు నడిచిన సమయంలో  రైల్వే మంత్రి చేతులు జోడించి నమస్కరించడానికి కారణమిదే.

click me!