కాషాయరంగులో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే?

By Mahesh K  |  First Published Sep 23, 2023, 7:10 PM IST

తొలి కాషాయ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ కేరళకు రాబోతున్నది. ఈ నెల 24వ తేదీన ప్రధాని మోడీ ప్రారంభించనున్న తొమ్మిది వందే భారత్ ఎక్స్‌‌ప్రెస్‌లలో కాసర్‌గోడ్- త్రివేండ్రం రూట్‌లో కాషాయ వర్ణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవల్లోకి రానుంది.
 


న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వైట్ కలర్‌లో వచ్చిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆ తెలుపు రంగు కాషాయ రంగుతో భర్తీ కాబోతున్నది. తొలి కాషాయ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కేరళకు రాబోతున్నది. ఈ నెల 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెసక‌ను ప్రారంభిస్తారు. కాషాయ రంగు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాసర్‌గోడ్-త్రివేండ్ర రూట్‌లో నడుస్తుంది. కేరళకు ఇది రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ కావడం గమనార్హం.

ఇందుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. వందే భారత్ కొత్త షేడ్స్‌లో కేరళకు త్వరలో వస్తున్నదని కామెంట్ చేశారు. గత నెల చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తొలి కాషాయ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను చూపించింది.

in new shades, soon in Kerala. pic.twitter.com/MbtRwtsLkd

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw)

Latest Videos

Also Read: గ్రూప్ 1 రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీపై హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు: ఈటల రాజేందర్

ఈ నెల 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను ప్రారంభించనున్నారు. అందులో ఉదయ్ పూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేవీ-మదురై - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసర్‌గోడ్-తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా-భువనేశ్వర్-పూరి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.

click me!