Driverless Metro Rail: బెంగళూర్ చేరుకున్న ‘డ్రైవర్‌ లెస్’ మెట్రో .. త్వరలో ట్రయల్‌ రన్‌?

Published : Feb 15, 2024, 04:35 AM IST
Driverless Metro Rail: బెంగళూర్ చేరుకున్న ‘డ్రైవర్‌ లెస్’ మెట్రో .. త్వరలో ట్రయల్‌ రన్‌?

సారాంశం

Driverless Metro Rail: తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుందని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఈ కోచ్‌లు దక్షిణ బెంగళూరులోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బగోడి డిపోకు చేరుకున్నాయి. ట్రయల్ రన్ ఎప్పుడంటే..? 

Driverless Metro Rail: బెంగళూరు (Bengaluru)మెట్రో  సరికొత్త అధ్యాయానికి నాంది పలుకనున్నది. డ్రైవర్‌ లెస్ మెట్రో రైలు (Driverless Metro Train) సేవలను మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు చైనా నుండి ఆరు కోచ్‌లతో కూడిన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు బుధవారం బెంగళూరుకు చేరుకుందని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) తెలిపింది. ఈ కోచ్‌లను దక్షిణ బెంగళూరులోని ఐటీ హబ్ ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బగోడి డిపోకు తరలించినట్లు తెలిపింది.

ఈ రైలును  ఎల్లో లైన్‌లో RV రోడ్ నుండి సిల్క్ బోర్డ్ మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ వరకు నడపనున్నారు. రైలు, కోచ్‌లను చైనా సంస్థ నిర్మించిందని, బిఎమ్‌ఆర్‌సిఎల్ కోసం 216 కోచ్‌లను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నదనీ, తాము 216 కోచ్ లను ఆర్డర్ చేసామనీ, వాటిలో 90 కోచ్‌లతో 15 రైళ్లు ఏర్పాటు చేసి ఎల్లో లైన్‌లో నడిపిస్తాం. ప్రస్తుతం వచ్చింది నమూనా రైలు అని BMRCL అధికారులు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !