డిల్లీలో బర్డ్ ప్లూ కలకలం... జూపార్క్ లో గుడ్లగూబ మృతి

By Arun Kumar PFirst Published Jan 17, 2021, 10:04 AM IST
Highlights

డిల్లీ జూపార్కులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యాక అన్ని పక్షులను ఐసోలేట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

న్యూడిల్లీ: వ్యాక్సిన్ రాకతో కరోనా కలకలం కాస్త తగ్గిందో లేదో ఇప్పుడు దేశంలో బర్డ్ ప్లూ భయం మొదలయ్యింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోకి వ్యాపించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని జూపార్కులోకి బర్డ్ ఫ్లూ ప్రవేశించింది. ఇటీవల జూపార్కులో మృతి చెందిన గుడ్లగూబ నమూనాను పరీక్షలకు పంపగా బర్డ్ ఫ్లూ వల్లే అది చనిపోయినట్లు నిర్దారణ అయ్యింది. 

ఈ సందర్భంగా జూపార్కు డైరెక్టర్ రమేష్ పాండే మాట్లాడుతూ... జూపార్కులో మృతి చెందిన గుడ్లగూబలో హెచ్-5ఎన్-5 ఎవియన్ ఇన్ఫ్లూయంజా నిర్థారణ అయినట్లు వెల్లడించారు. మృతి చెందిన గుడ్లగూబ శాంపిల్‌ను ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అండ్ యానిమల్ డిసీజెస్(ఎన్ఐహెచ్ఎస్డీ)కి పంపించినట్లు తెలిపారు.

read more  తెలంగాణలో బర్డ్ ప్లూ కలకలం... భారీగా నాటుకోళ్ళు మృతి

బర్డ్ ప్లూ వ్యాప్తి నేపథ్యంలో జూపార్క్ లో మిగతా పక్షులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జూపార్కు డైరెక్టర్ తెలిపారు. జూపార్కు మొత్తాన్ని శానిటైజేషన్ చేశామని...పక్షులను ఐసోలేట్ చేశామన్నారు. అలాగే జూపార్కులోకి సందర్శకుల రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు రమేష్ పాండే పేర్కొన్నారు.

ఇక మహారాష్ట్రలో శనివారం నాటికి మొత్తం 983 పక్షులు మృత్యువాతపడ్డాయి. లాతూర్‌లో అధ్యధికంగా 253, యవత్మల్‌లో 205, అహ్మద్ నగర్ 151, వార్ధా 109, నాగ్పూర్ 45, గోందియాలో 23 ఫౌల్ట్రీ పక్షులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.  

click me!