అసోంలో ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ: ఇది కూడ చైనా నుంచే...

By narsimha lode  |  First Published May 4, 2020, 1:40 PM IST

అస్సాం రాష్ట్రంలో మరో వైరస్ వెలుగు చూసింది. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది.  ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ ప్రబలి 306 గ్రామాల్లో 2,500 పందులు మరణించాయని ప్రభుత్వం ప్రకటించింది.
 


న్యూఢిల్లీ: అస్సాం రాష్ట్రంలో మరో వైరస్ వెలుగు చూసింది. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది.  ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ ప్రబలి 306 గ్రామాల్లో 2,500 పందులు మరణించాయని ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డీసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఎడి) ఈ వైరస్ ను ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూగా తేల్చిందని ప్రభుత్వం తెలిపింది. 

Latest Videos

undefined

ఈ వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడ ప్రకటించింది.రాష్ట్రంలో సుమారు 21 లక్షల నుండి 30 లక్షలకు పందుల సంఖ్య పెరిగినట్టుగా అసాం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తెలిపారు.కరోనా వైరస్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

పందుల లాలాజం,రక్తం, మాంసం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి కావడంతో దీన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటుంది.

సామూహికంగా పందులను చంపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే వైరస్ నివారణకు గాను తాము ప్రత్యామ్నాయ పద్దతులను అన్వేషిస్తున్నామని అసాం మంత్రి అతుల్ బోరా తెలిపారు. 

also read:లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

ఈ వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. ఈ వ్యాధి సోకిన పది కి.మీ. దూరంలో నిఘా ఏర్పాటు చేశారు. వ్యాధి సోకిన ప్రాంతాల నుండి పందుల రవాణాను నిలిపివేశారు.ఇతర ప్రాంతాల నుండి కూడ పందులను వ్యాధి సోకిన ప్రాంతాలకు కూడ అనుమతించడం లేదు. 

2019 ఏప్రిల్ మాసంలో చైనాలో ఈ వైరస్ తొలిసారిగా వెలుగు చూసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న గ్జిజాంగ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఈ వైరస్ పుట్టింది. 

click me!