యూపీలో డెంగీ కలకలం : 32 మంది చిన్నారులు సహా 41 మంది మృతి !

By AN TeluguFirst Published Sep 2, 2021, 12:07 PM IST
Highlights

ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్ జిల్లా ప్రధాన వైద్యాధికారి నీత కుల్ శ్రేష్ట్ ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమెను అలీగఢ్ మల్ ఖాన్ సింగ్ జిల్లా ఆస్పత్రికి సీనియర్ కన్సల్టెంట్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో 32 మంది పిల్లలు సహా 41 మంది మరణించడం కలకలం రేపుతోంది. దీనికి డెంగీనే కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణమీద ప్రభుత్వ నిర్లక్ష్యం చూపుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్ జిల్లా ప్రధాన వైద్యాధికారి నీత కుల్ శ్రేష్ట్ ను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమెను అలీగఢ్ మల్ ఖాన్ సింగ్ జిల్లా ఆస్పత్రికి సీనియర్ కన్సల్టెంట్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే బదిలీ ఎందుకు చేశారన్న విషయం మీద స్పష్టత లేదు. మరోవైపు ఫిరోజాబాద్ లో ప్రస్తుత పరిస్థితి పై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ ఐసీఎంఆర్ నుంచి 11 మంది నిపుణుల బృందం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. 
 
click me!