జమ్మూ కాశ్మీర్ రాజౌరి ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు.. ఇద్దరు పౌరులు మృతి..స్థానికుల నిరసనలు

Published : Dec 16, 2022, 12:40 PM IST
జమ్మూ కాశ్మీర్ రాజౌరి ఆర్మీ క్యాంపు సమీపంలో కాల్పులు.. ఇద్దరు పౌరులు మృతి..స్థానికుల నిరసనలు

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాజౌరి జిల్లాలో ఉన్న సైనిక శిబిరం వెలుపల శుక్రవారం తెల్లవారుజామున  జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.   

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉన్న సైనిక శిబిరం వెలుపల శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. అయితే ఈ కాల్పులకు, తదుపరి జరిగిన పౌరుల ప్రాణనష్టానికి ‘‘గుర్తించబడని తీవ్రవాదులు’’ కారణమని సైన్యం తెలిపింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్థానికులు వీధుల్లోకి వచ్చారు. ఆర్మీ క్యాంపు ఆల్ఫా గేట్ వెలుపల హత్యలను నిరసిస్తూ శిబిరంపై రాళ్లు రువ్వారు.

వంటిల్లు తెలంగాణలో.. బెడ్రూం మహారాష్ట్రలో.. ఓ ఇంటి వింత కథ.. రెండు రాష్ట్రాల్లోనూ పన్నులు, పథకాలు...

ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జమ్మూ-పూంచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. వారిని శాంతింపజేసేందుకు సీనియర్ సివిల్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం 6.15 గంటలకు స్థానికులు పని కోసం ఆర్మీ గేటు వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. మృతులను రాజౌరి నివాసి కమల్ కుమార్, సురీందర్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ కుమార్‌గా గుర్తించారు.

పాకిస్థాన్ ను ప్రపంచం మొత్తం ఉగ్రవాద కేంద్రంగా చూస్తోంది - విదేశాంగ మంత్రి జైశంకర్

క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆర్మీ హాస్పిటల్ లో చేర్చారు. “ఉదయం రాజౌరీలో గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు, భద్రతా బలగాలు మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సైట్‌లో ఉన్నారు. ” అని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. 

కాగా.. పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అయితే అదుపులో ఉందని అధికారులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలను ఆరా తీస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం