దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది చిన్నారులకు గాయాలు

By Asianet News  |  First Published Oct 25, 2023, 12:58 PM IST

దుర్గా విగ్రహ నిమజ్జన వేడుకల సందర్భంగా మంటలు చెలరేగాయి. దీంతో 9 మంది చిన్నారులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జరిగింది.


దుర్గామాత విగ్రహ నిమ్మజన ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు సమయంలో ఒక్క సారిగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో తొమ్మిది మంది చిన్నారలకు గాయాలు అయ్యాయి. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే గుడ్ బై.. ఎందుకంటే ?

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. దేవీ నవరాత్రులు ముగింపు అనంతరం దసరా సందర్భంగా సతారా జిల్లాలోని ప్రముఖ హిల్ స్టేషన్ మహాబలేశ్వర్ లోని కోలి ఆలీ ప్రాంతాంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. దుర్గామాతను అలంకరించిన ఓ వాహనంలో ఉంచి ఊరేగింపు చేపడుతున్నారు. అందులోనే లైటింగ్ కోసం ఓ జనరేటర్ ను కూడా అమర్చారు. భక్తులు డ్యాన్స్ లు చేస్తుండగా.. చక్కగా ఊరేగింపు సాగిపోతోంది. 

అయితే సాయంత్రం సమయంలో వాహనంలో ఉన్న జనరేటర్ వేడెక్కింది. దాని పక్కనే పెట్రోల్ తో నిండిన క్యాన్ ఉండటంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనంలో ఓ మూల కూర్చున్న తొమ్మిది మంది చిన్నారులకు కాలిన గాయాలు అయ్యాయి. అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై, క్షతగాత్రులను సతారా, పుణెలోని హాస్పిటల్ కు తరలించారు. పిల్లలందరీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఎస్పీ సమీర్ షేక్ చెప్పారు.

విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మూగ, బదిర బాలులు..

ఇదిలా ఉండగా.. బీహార్ లోనూ దుర్గా పూజ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు మరణించారు. గోపాల్ గంజ్ లో ఓ దుర్గా పూజ మండపం ఉంది. ఈ మండపానికి దేవీ నవరాత్రుల సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమవారం నవమి కావడంతో ఇంకా పెద్ద సంఖ్యలు ప్రజలు గుమిగూడారు. పూజలు కొనసాగుతున్న సమయంలో, జన సందోహం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్క సారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది.

మూఢత్వానికి మహిళ బలి.. దెయ్యం విడిపిస్తానని తాంత్రికుడి చిత్రహింసలు.. వివాహిత మృతి

పూజా మండపం గేటు వద్ద ఈ తొక్కిసలాటలో ఓ బాలుడు కిందపడిపోయాడు. ఆ బాలుడిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. వారు బాలుడిని రక్షించేందుకు పరిగెత్తుతుండగా కింద పడిపోయారు. దీంతో వారు కూడా ఈ తొక్కిసలాటలలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ముగ్గురు ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని 200 మీటర్ల దూరంలో హాస్పిటల్ కు తరలించారు. కానీ ఆలోపే పరిస్థితి విషమించడంతో మరణించారు.

click me!