రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

By telugu teamFirst Published 26, Apr 2019, 10:35 AM IST
Highlights

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  స్టేషన్ లోని క్యాంటీన్ లో మంటలు చెలరేగడంతో రైల్వేస్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్ లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి.. వెంటనే వాటిని ఆపేందుకు ప్రయత్నించారు.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు. వెంటనే అప్రమత్తమై మంటలను ఆపకపోయి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు అభిప్రాయపడ్డారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Last Updated 26, Apr 2019, 10:35 AM IST