ఇంటి ఓనర్‌తో భార్య అక్రమ సంబంధం: ఇద్దరికి వివాహం జరిపించిన భర్త

Siva Kodati |  
Published : Apr 26, 2019, 08:23 AM IST
ఇంటి ఓనర్‌తో భార్య అక్రమ సంబంధం: ఇద్దరికి వివాహం జరిపించిన భర్త

సారాంశం

పరాయి వ్యక్తితో భార్య చనువుగా ఉందని తెలిస్తే భార్యనో.. ఆమె ప్రియుడినో భర్త దారుణంగా చంపుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని తెలిసినప్పటికీ ఏ మాత్రం ఆగ్రహించకుండా.. ప్రేమికునితో భార్యకు పెళ్లి చేశాడో భర్త.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని భాగల్పూర్ సమీపంలోని ఖిరీభాఘ్ పంచాయతీ పరిధిలోని సాలెపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. వీరికి రెంళ్ల కుమారుడు ఉన్నాడు.

అయితే ఓ కేసులో అతనిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో అతని భార్యకు ఆ ఇంటి యజమాని కుమారుడు మోనుతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. శిక్షా కాలం ముగియడంతో ఆమె భర్త జైలు నుంచి విడుదలయ్యాడు.

తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఏర్పడినట్లు తెలిసింది. మంచి మనసుతో అర్ధం చేసుకున్న అతను వారిద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించుకుని.. ఒక శుభముహుర్తాన ఇద్దరికి పెళ్లి చేశాడు. అంతేకాకుండా తన రెండున్నరేళ్ల కుమారుడిని తన భార్యకు కానుకగా ఇచ్చాడు. ఈ పెళ్లి స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్