ఇస్రోలో అగ్నిప్రమాదం

By ramya neerukondaFirst Published Dec 28, 2018, 3:39 PM IST
Highlights

గుజరాత్ లోని అహ్మదాబాద్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో)లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది.  వెంటనే  స్పందిచిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

గుజరాత్ లోని అహ్మదాబాద్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో)లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది.  వెంటనే  స్పందిచిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఇస్రో కేంద్రానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా.. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఈ సంఘటనకు సంబంధించి   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది మే నెలలోనూ అహ్మదాబాద్‌ ఇస్రో కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్పేస్‌ అప్లికేషన్ సెంటర్‌లో మంటలు తలెత్తి క్షణాల్లోనే ల్యాబ్‌ అంతా వ్యాపించారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

click me!