కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి

Published : Nov 27, 2020, 07:38 AM IST
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదుగురు రోగులు మృతి

సారాంశం

శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు. 

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.  గుజరాత్ రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజ్ కోట్ నగరంలోని శివానంద్ ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

శివానంద్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఐదుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఐసీయూలో మంటలు చెలరేగినపుడు 11 మంది రోగులున్నారు. ఈ అగ్నిప్రమాదంలో పలువురు రోగులు తీవ్రంగా గాయపడ్డారు.

 గాయపడిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం