దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. వైరస్ బారినపడి జనం పిట్టల్లా రాలుతున్నారు. సామాజిక పరిస్ధితులు సైతం దేశంలో నానాటికీ దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద బెడ్లు దొరక్క జనం పడిగాపులు కాస్తున్నా ఫలితం మాత్రం శూన్యం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలాన్ని సృష్టిస్తోంది. వైరస్ బారినపడి జనం పిట్టల్లా రాలుతున్నారు. సామాజిక పరిస్ధితులు సైతం దేశంలో నానాటికీ దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద బెడ్లు దొరక్క జనం పడిగాపులు కాస్తున్నా ఫలితం మాత్రం శూన్యం.
తమ వారి పరిస్ధితి విషమంగా వుందని దయచేసి ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ ప్రాధేయపడటం.. కంటతడి పెట్టిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.
undefined
ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక, ఆక్సిజన్ కొరతతో కొవిడ్ రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న నరకం వర్ణనాతీతం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వైద్య సదుపాయాల కొరతకు తోడు కరోనా రోగుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో పరిస్థితులు దిగజారిపోతున్నాయి.
Also Read:కరోనా టెస్టుల భయం: సిల్చార్ ఎయిర్‌పోర్టు నుండి 300 మంది ప్రయాణీకులు జంప్
తాజాగా గురువారం లోక్‌నాయక్ జయప్రకాశ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి వద్ద జరిగిన ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అస్లాంఖాన్ అనే వ్యక్తి కరోనా సోకిన తన భార్య రుబీఖాన్ (30)ని బైక్‌పై ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అప్పటికే మూడు ఆస్పత్రులకు తిరిగినా ఎవ్వరూ చేర్చుకోలేదు. దీంతో అస్లాంఖాన్ తన భార్యను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే అలసిపోయిన అతను తన భార్య చనిపోతుంది.. దయచేసి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోండి’’ అంటూ సిబ్బందిని ప్రాధేయపడిన దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి.
మరోవైపు, మెడికల్ ఆక్సిజన్, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో పడకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి హామీలు వస్తున్నా.. నానాటికీ పెరిగిపోతున్న కొత్త రోగులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వద్ద కొవిడ్ రోగులతో అంబులెన్స్‌లు, ప్రైవేటు వాహనాలు భారీగా క్యూకట్టాయి.
ఈ రద్దీ మధ్య రోగులు, వారి బంధువులు అత్యవసర వైద్యసాయం కోరుతూ అడ్మిషన్ కోసం గంటల తరబడి ఎదురుచూపులు చూస్తున్నారు. ఈలోగా మాయదారి మహమ్మారి ప్రాణాలను తీసేస్తోంది.