వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

Published : Aug 31, 2019, 09:41 AM IST
వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

సారాంశం

.దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 


గుజరాత్ రాష్ట్రం సూరత్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ లోని  ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా  ఈ ఏడాది మేలో సూరత్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటనలో దాదాపు 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరవక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !