ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవ దహనం

Siva Kodati |  
Published : Feb 12, 2019, 07:50 AM ISTUpdated : Feb 12, 2019, 08:14 AM IST
ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది సజీవ దహనం

సారాంశం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది సజీవదహనమవ్వగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్‌ అనే హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఏం జరుగుతుందో తెలిసేలోపు, అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాద పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. పలువురుమంటల్లో చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు.

హోటల్ సిబ్బంది సుమారు పాతిక మందిని రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?