బెంగుళూరు ఎయిర్‌షోలో భారీ అగ్ని ప్రమాదం: 100 కార్లు దగ్ధం

Published : Feb 23, 2019, 01:25 PM ISTUpdated : Feb 23, 2019, 01:31 PM IST
బెంగుళూరు ఎయిర్‌షోలో భారీ అగ్ని ప్రమాదం: 100 కార్లు దగ్ధం

సారాంశం

 బెంగుళూరు ఎయిర్‌షోలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో సుమారు 100 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి

బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌షోలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో సుమారు 100 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

శనివారం నాడు ఎయిర్‌షో‌ను చూసేందుకు వచ్చే వారు కార్లను పార్కింగ్ చేసే ప్రదేశంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. తొలుత ఓ కారులో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఇతర కార్లకు  వ్యాపించాయి. దీంతో పార్కింగ్ స్థలంలో ఉన్న సుమారు 100 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 12 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు కిలోమీటర్ మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. ఎయిర్‌ షో‌లోని గేట్ నెంబర్ 5 వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు