రైతుల ఎకౌంట్లోకి రూ.2వేలు.. రేపే ప్రధాని కిసాన్ స్కీమ్ ప్రారంభం

By ramya NFirst Published Feb 23, 2019, 10:51 AM IST
Highlights

దేశవ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి రేపు రూ.2వేలు పడనున్నాయి. 

దేశవ్యాప్తంగా ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులందరి ఖాతాల్లోకి రేపు రూ.2వేలు పడనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. కాగా.. బడ్జెట్ లో ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ స్మాన్ నిధి పథకాన్ని మోదీ రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

5ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు రైతుల ఎకౌంట్లలోకి రూ.2వేలు పడనున్నాయి. మొదటి విడుదతలో భాగంగా రేపు రైతులకు ఈ నగదు ఇస్తున్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మొదటి వాయిదా పొందేందుకు రైతులు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని గతంలోనే ప్రకటించింది ప్రభుత్వం.

click me!
Last Updated Feb 23, 2019, 10:51 AM IST
click me!