CM Bhagwant Mann: ఇచ్చిన‌ హామీని నెర‌వేర్చిన పంజాబ్ సీఎం.. 789 బాధిత రైతుల‌కు ఆర్థిక సాయం..  

By Rajesh KFirst Published Aug 6, 2022, 6:08 PM IST
Highlights

CM Bhagwant Mann: కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్ రైతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగానే బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం భగవంత్ మాన్ నేరవేర్చుతున్నారు. 

CM Bhagwant Mann: కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల‌కు పంజాబ్ అండ‌గా నిలిచింది. ఈ ఆందోళ‌న‌లో మ‌ర‌ణించిన 789 మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్ర‌భుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మేర‌కు  ఒక్కో రైతు కుటుంబానికి ₹ 5 లక్షలు ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం ₹ 39.55 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేసింది భగవంత్ మాన్ ప్ర‌భుత్వం. 

ఈ సంద‌ర్బంగా పంజాబ్ సీఎం భగవాన్ మాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 789 రైతు కుటుంబాలకు సాయం అందించామని, ఇందుకోసం మొత్తం 39.55 కోట్ల నిధుల‌ను విడుదల చేసిన‌ట్టు తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించామ‌ని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం.. తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని,  త‌న హయాంలో రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు చేయాల్సిన అవసరం లేదని సీఎం భగవంత్ మాన్ అన్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల ఆశ్రితులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని, బలిదానం చేసుకున్న రైతుల సమీప బంధువులకు త్వరలో మిగిలిన సాయం, పరిహారం అందజేస్తామని చెప్పారు. 

ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే పచ్చిమిర్చి రూపంలో ప్రత్యామ్నాయ పంటను ప్రవేశపెట్టిందని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నేరుగా వరి నాట్లు వేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందని శ్రీ మాన్ చెప్పారు. రైతులు మరియు వారి కుటుంబాల ప్రయోజనాలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, అధికారిక ప్రకటన ప్రకారం.. బాధిత కుటుంబాల‌కు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని సీఎం మాన్ అన్నారు.

అదే సమయంలో.. చెరకు రైతులకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను క్లియర్ చేయడంతో సహా చాలా డిమాండ్లను ముఖ్యమంత్రి మాన్ అంగీకరించడంతో అనేక రైతు సంఘాలు తమ ప్రతిపాదిత ఆందోళనను విరమించుకోవాలని మంగళవారం నిర్ణయించాయి.  

భారతీయ కిసాన్ యూనియన్ (సిధుపూర్) అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నేతృత్వంలో.. సిఎం మాన్‌తో రైతు నాయకులతో 4 గంటల సుదీర్ఘ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చెరుకు బకాయిల చెల్లింపుతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి డిమాండ్లపై రైతులు మాఝా, మాల్వా, దోబా ప్రాంతాల్లోని మూడు చోట్ల జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని బెదిరించారు. అయితే.. సమావేశం అనంతరం రైతు నేతలు అంగీకరించారు. అనంతరం సీఎం మాన్‌ మాట్లాడుతూ.. 'చెరుకు రూ.195.60 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మా ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి రూ.100 కోట్లు, మిగిలిన రూ.95.60 కోట్లు సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

click me!