Congress protest: కాంగ్రెస్ నిరసన.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన రాహుల్

Published : Aug 06, 2022, 05:13 PM IST
 Congress protest: కాంగ్రెస్ నిరసన.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన రాహుల్

సారాంశం

Congress protest: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన‌లు చేప‌ట్ట‌డంపై ఢిల్లీ పోలీసులు తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పెంపునకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.     

Congress protest: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ శుక్ర‌వారం ఢిల్లీలో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయ‌కులపై ఢిల్లీ పోలీసులు చ‌ర్య‌ల‌ను తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున  ప్రదర్శనలు చేసింది. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు మార్చ్‌ చేపట్టాలని ఆ పార్టీ నేతలు భావించారు. 

ఈ క్ర‌మంలో వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్ర‌యత్నించారు. దీంతో దేశ రాజ‌ధానిలో ఆందోళ‌న చెలారేగింది. ఈ క్ర‌మంలో పలువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీలో ప‌లు చోట్ల‌ 144 సెక్షన్‌ విధించారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు దీనిని పట్టించుకోలేదు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు చేప‌ట్టారు. దీంతో  ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నేడు నిరస‌న‌ల్లో పాల్గొన్న అధికారుల‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తూ, "మన దేశంలో నిరసనలు చేయడం చట్టవిరుద్ధం, మా అభిప్రాయాలను చెప్పడం చట్టవిరుద్ధం. వారు (బిజెపి ప్రభుత్వం) వారు ఏమి చేయగలరు" అని అన్నారు. 

నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున దేశ రాజధానిలో నిరసనలు నిర్వహించడానికి కాంగ్రెస్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. 65 మంది ఎంపీలతో సహా 300 మంది నిరసనకారులను  ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 

అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ పనితీరుపై హోంమంత్రి అమిత్ షా  సంచ‌ల‌న ప్రకటన చేశారు.  కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని.. కాంగ్రెస్ నిర‌స‌న‌లు రామజన్మభూమి శంకుస్థాపనను వ్యతిరేకిస్తున్నామని, కాంగ్రెస్ బుజ్జగింపు విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంద‌నీ, అందుకే కాంగ్రెస్ నేత‌లు నల్ల బట్టలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నార‌ని షా ఆరోపించారు. 

షా ప్రకటనపై దాడి చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుంద‌ని మండిప‌డ్డారు. సింప్లిసిటీ, ధైర్యం, సంయమనం, త్యాగం, నిబద్ధత, దీనబంధు రామ్ పేరులోని అంతరార్థం. అందరిలో రాముడు, అందరితో రాముడు. రాంలాలా ఆలయ భూమిపూజ కార్యక్రమం జాతీయ ఐక్యత, సోదరభావం, సాంస్కృతిక సమావేశానికి ఒక సందర్భం. ద్రవ్యోల్బణం పెంచి బలహీనులను బాధపెట్టేవాడు శ్రీరాముడిపై దాడి చేస్తాడు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉద్యమించే వారితో తప్పుడు మాటలు మాట్లాడేవాడు లోక్‌నాయక్‌ రామ్‌ని, భారత ప్రజలను అవమానిస్తాడని ట్విట్ చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్