
మధ్యప్రదేశ్‌లో మత ఘర్షణ చోటు చేసుకుంది. నీముచ్‌లోని పురాణి కచారి ప్రాంతంలోని దర్గా సమీపంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించడంపై రెండు వర్గాల మధ్య సోమవారం రాత్రి వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతోపాటు లాఠీలను ఉపయోగించి గుంపును చెదరగొట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నీముచ్ సిటీ ప్రాంతంలో 144 సెక్షన్ విధించినట్లు నీముచ్ ఎస్పీ సూరజ్ వర్మ తెలిపారు. ఇరు వర్గాల ఘర్షణ సమయంలో నాలుగు టూ వీలర్లు దెబ్బతిన్నాయని, కానీ ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు.
ఢిల్లీకి బిగ్ రిలీఫ్.. నాలుగు రోజుల పాటు వేడి గాలుల నుంచి ఉపశమనం.. వర్షాలు పడే చాన్స్..
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నీముచ్ పాత కోర్టు ప్రాంతంలో దర్గా భూమి ఉంది. సోమవారం సాయంత్రం కొందరు వ్యక్తులు ఈ భూమిలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రయత్నించారు. అయితే సందర్భంగా దర్గాలో ఉన్న కొందరు వ్యక్తులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అర్థరాత్రి వివాదం ముదిరింది. ఒక్కసారిగా రాళ్లదాడి మొదలైంది. ఈ క్రమంలో కొందరు ఓ కారుకు నిప్పు పెట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలు కూడా ప్రయోగించారు. ఈ ఘర్షణపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది.
నీముచ్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నేహా మీనా ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ ఊరేగింపులు, ధర్నాలు చేయకూడని, అలాగే గుంపులు గుంపులుగా సంచరించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే లేకుండా ఏ వ్యక్తి లేదా సంస్థ ఏ ఈవెంట్‌ను నిర్వహించకూడదని పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం కూడా నిషేధమేనని తెలిపారు. కాగా గత రెండు నెలల కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో మత ఘర్షణలు వెలుగు చూశాయి.
కత్తితో బెదిరించి.. 20 ఏళ్ల ఏళ్ల యువతిపై అన్నదమ్ముల గ్యాంగ్ రేప్
గత వారం మధ్యప్రదేశ్ లోని ఖార్గోన్ జిల్లాలో 144 సెక్షన్ను తిరిగి విధించారు. గత బుధవారం జిల్లా యంత్రాంగం, పోలీసులు సంయుక్తంగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జూలై 10 వరకు అల్లర్లు జరిగిన జిల్లాలో ర్యాలీలు, ఊరేగింపులు, జాగరణలు, శోభాయాత్రలు లేదా రాజకీయ ర్యాలీలను అనుమతించరు.
ఏప్రిల్ 10న శ్రీరామనవమి సందర్భంగా ఖార్గాన్ లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను రాష్ట్ర యంత్రాంగం శనివారం బదిలీ చేసింది. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా మతఘర్షణల సమయంలో గాయపడిన ఎస్పీ సిద్ధార్థ్ చౌదరిని ఖర్గోన్ ఏఎస్పీ నీరజ్ చౌరాసియాతో పాటు భోపాల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. హింసకు సంబంధించి నమోదైన 72 కేసుల్లో ఇప్పటివరకు 182 మందిని అరెస్టు చేశారు.