దారుణం.. మైనర్ తో ఆరునెలల్లో పెళ్లి.. కాబోయే భార్యమీద అత్యాచారం, హత్య... విషం తాగి ఆత్మహత్య...

By SumaBala BukkaFirst Published Dec 10, 2022, 7:37 AM IST
Highlights


కాబోయే భార్య మీద అత్యాచారం, హత్య చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఆ తరువాత భయపడి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

కర్ణాటక : పెళ్లి చేసుకోబోయే యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణమైన ఘటన కర్ణాటకలోని యశ్వంతపురలో చోటుచేసుకుంది. మూడు ముళ్ళు వేయకముందే.. ఆమె జీవితానికి ముగింపు పలికాడు ఆ కీచకుడు. మైనర్ యువతిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే కాకుండా..  పెళ్లికి ఇంకా సమయం ఉండగానే ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను హత్య చేశాడు.

దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి జరిగినట్లు తేలింది. దీంతో ఆ యువకుడికి భయం పట్టుకుంది. దొరికిపోతే.. జైల్లో పెడతారనే భయంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది విఫలం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ తర్వాత మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన తాలూకాలో జరిగింది.

ఈ దారుణమైన విషాద ఘటన వివరాలిలా వెడితే.. కడలూరు గ్రామానికి చెందిన దినేష్ కు, కొణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. అయితే అమ్మాయి మైనర్. మరో ఆరు నెలల్లో ఆమెకు 18యేళ్లు నిండుతాయి. దీంతో పెళ్లిని ఆరునెలల తరువాతకి పెట్టుకున్నారు.

సెల్ఫీ పిచ్చి.. 120అడుగుల లోతు లోయలో పడ్డ కొత్తజంట.. పెళ్లి వాయిదా ..

ఇంతలో కాబోయే భార్యను చూడాలనిపించి.. దినేష్  ఆ యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. ఆమెతో మాట్లాడి వచ్చేస్తే గొడవే ఉండేది కాదు. కానీ.. అతనిలో కోరిక పుట్టింది. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో కాబోయే అల్లుడు చేసిన ఈ దారుణానికి వారు షాక్ అయ్యారు. ఆ తరువాత కోపానికి వచ్చి ప్రశ్నించారు. దీంతో నవంబర్ 28న దినేష్  మరోసారి ఆ యువతి ఇంటికి వెళ్ళాడు.  ఇంట్లో ఎవరులేరని చూసి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

అది చూసిన తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాలేదు. కాబోయే అల్లుడు చేసిన ఘాతుకం.. కూతురి మీద అత్యాచారం బయటికి వస్తే పరువు పోతుందని భయపడి..  కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె మీద అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అరెస్టు చేస్తారని దినేష్ భయపడ్డాడు. 

అంతే మూడు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే  దగ్గర్లోని హాసన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స శుక్రవారం తెల్లవారుజామున దినేష్  మృతి చెందాడు. ఒక చిన్న పొరపాటు, తొందరపాటు ఇద్దరి నిండు జీవితాలని బలితీసుకుంది. ఆరునెలల్లో కలిసి జీవిత ప్రయాణాన్ని కొనసాగించాల్సిన వాళ్ళు.. అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. 

click me!