నీట్‌ పరీక్షకు హాజరైన అమ్మాయిల లోదుస్తుల తొలగింపు: వారి కోసం మళ్లీ పరీక్ష.. ఏన్టీఏ కీలక నిర్ణయం!

By Sumanth KanukulaFirst Published Aug 27, 2022, 9:51 AM IST
Highlights

నీట్ పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీల పేరుతో తమ లోదుస్తులను తొలగించాలని పలువురు బాలికలు ఆరోపించడం తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌ కీలక నిర్ణయం తీసుకుంది.

మెడికల్ కాలేజ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీల పేరుతో తమ లోదుస్తులను తొలగించాలని పలువురు బాలికలు ఆరోపించడం తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బాలిక కోసం NEET పరీక్షను తిరిగి నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఇండియా టూడే రిపోర్ట్ చేసింది. ఇదే విషయాన్ని నిర్దారిస్తూ ఎన్టీఏ విద్యార్థినిలకు మెయిల్ పంపిందని తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 4న బాలికలకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వబడుతుంది.

కేరళలోని కొల్లాం జిల్లాలో ఏర్పాటు చేసిన  నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు అమ్మాయిలను వారి లోదస్తులను తీసివేయమని అడిగారన్న నివేదికలు వెలువడ్డాయి. దీంతో భారీ వివాదం చెలరేగింది. ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పరీక్షకకు ముందు తాము మానసిక వేదనకు గురయ్యామని బాధిత అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 

ఈ క్రమంలోనే మానవ హక్కుల కమిషన్ ఈ విషయంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కొల్లం రూరల్ ఎస్పీని ఆదేశించింది. ఇక, ఈ ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించేందుకు ఎన్‌టీఏ ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

click me!