ప్రియుడ్ని ముసుగుతో రమ్మని... చోరీ చేయించిన మహిళ

By narsimha lodeFirst Published May 1, 2019, 12:46 PM IST
Highlights

తమిళనాడులోని కోయంబత్తూరు రామనాథపురంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్‌ సంస్థలో జరిగిన దోపిడీ కేసులో మహిళా ఉద్యోగితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు రామనాథపురంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్‌ సంస్థలో జరిగిన దోపిడీ కేసులో మహిళా ఉద్యోగితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

కోయంబత్తూరులోని రామనాథపురంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ సంస్థలో రేణుకా దేవి పనిచేస్తోంది. ఈ సంస్థలో  ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలని  ప్లాన్  చేసింది. ఈ మేరకు ఈ పనికి తన ప్రియుడిని వినియోగించుకొంది.

ముత్తూట్ మినీ ఫైనాన్స్ కార్యాలయంలో  గత నెల 27 సాయంత్రం ఓ ముసుగు దొంగ చొరబడి ఇద్దరు మహిళా ఉద్యోగులపై దాడి చేసి లాకర్లలో భద్రపరిచిన రూ. కోట్ల విలువైన నగలు, రూ. 1.34 లక్షల నగదును దోచుకొన్నాడు.

ముసుగు దొంగను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక పోలీసు దళాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.గతనెల 27వ తేదీన సాయత్రం ఓ ముసుగు దొంగను చొరబడి ఇద్దరు మహిళా ఉద్యోగులపై దాడి చేసి బంగారు ఆభరణాలను తీసుకెళ్లాడు. దొంగల దాడిలో తాము స్పృహ తప్పిపోయినట్టుగా మహిళా ఉద్యోగినులు చెప్పారు.

మహిళా ఉద్యోగినులపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో లేవు. దీంతో ఇద్దరు మహిళ ఉద్యోగినులపై పోలీసులకు  అనుమానం కల్గింది.. ఇరువురిని వేర్వేరుగా విచారణ జరిపారు. రేణుకాదేవి తన ప్రియుడిని ముసుగు దొంగ వేషంలో రప్పించి దోపిడీ జరిగేందుకు అన్ని విధాల సహకరించిందని గుర్తించారు.

 దోపిడీ జరిగిన రోజులు రేణుకాదేవి సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను పరిశీలించగా ఒకే వ్యక్తి చాలామార్లు కాల్స్‌ చేసినట్లు కనుగొన్నారు. ఆ నెంబర్‌ ఆధారంగా ఆ వ్యక్తి కెంబట్టి కాలనీకి చెందిన సురేష్‌ (32) అని కనుగొన్నారు. 

కోయంబత్తూరు సమీపం పోత్తనూరులో భర్త జాన్‌పీటర్‌తో నివసిస్తున్న రేణుకాదేవి (26)కి కొద్ది నెలలకు ముందు ముత్తూట్‌ మినీలో నగలు కుదువబెట్టేందుకు వచ్చిన సురేష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తనను గట్టెక్కించడానికి ఐడియా చెప్పమంటూ సురేష్‌ కోరడంతో రేణుకాదేవి తన సంస్థలోని నగలు దోచుకుని పారిపోదామని తెలిపింది. సాయంత్రం వేళ లో ముసుగు దొంగగా వచ్చి నగలను దోచుకెళ్లమని దోపిడీకి రేణుకాదేవి పథకాన్ని వివరించింది. 

ఆ మేరకు సురేష్‌ ముసుగు దొంగ వేషంలో వచ్చి దర్జాగా నగలను, నగదును దోచుకెళ్ళాడు. చివరకు ఇరువురి గుట్టురట్టు కావడంతో కటకటాలపాలయ్యారు. ఈ దోపిడీతో రేణుకాదేవితో పాటు పనిచేస్తున్న దివ్య అనే ఉద్యోగికి సంబంధం ఉందా అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 

click me!