పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతారు: ఏఎంఎంకే నేత కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 1, 2019, 7:55 AM IST
Highlights

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతారంటూ ఏఎంఎంకే నేత తంగతమిళ్ సెల్వన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బీజేపీలో చేరుతారంటూ ఏఎంఎంకే నేత తంగతమిళ్ సెల్వన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

మధురైలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేదని వారు ఏర్పాటు చేసింది మెగా కూటమి కాదని, ప్రజా వ్యతిరేక కూటమని విమర్శించారు.

అన్నాడీఎంకే-బీజేపీ కూటమి లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలవుతుందని. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని తమిళ్ సెల్వం ఎద్దేవా చేశారు. అందుకే వారు అసహనంతో మాట్లాడుతున్నారని, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మీడియాతో కోపంగా మాట్లాడటం సరికాదన్నారు.

పదవి కోసం పన్నీర్ సెల్వం, ఇతర నేతలు ఎంతకైనా తెగిస్తారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ ఓడిపోతే అన్నాడీఎంకేలో గందరగోళం ఏర్పడుతుందని, ఆ పరిస్థితులలో పన్నీర్ సెల్వం కుటుంబంతో సహా బీజేపీలో చేరుతారని తమిళ్ సెల్వన్ ఆరోపించారు.

రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఏఎంఎంకే ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి అన్నాడీఎంకే నేతలు.. ముగ్గురు ఎమ్మెల్యేల విషయమై స్పీకర్‌ను కలిశారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తమిళ్ సెల్వన్ తెలిపారు. 

click me!